ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? | What is the state where the elephants? | Sakshi
Sakshi News home page

ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?

Published Mon, Dec 8 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

ఏనుగులు ఎక్కువగా  ఉన్న రాష్ట్రం ఏది?

ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?

విభిన్నమైన శీతోష్ణస్థితులు, భౌగోళిక లక్షణాలు ఉండటం వల్ల  భారతదేశం అనాదిగా  అనేక రకాల పశుపక్షాదులకు నిలయంగా ఉంది. తద్వారా ప్రపంచంలో అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశాల్లో  ఒకటిగా గుర్తింపు పొందింది. రాయల్ బెంగాల్ టైగర్,  ఒంటికొమ్ము ఖడ్గమృగం లాంటివి భారతదేశ వన్యప్రాణి సంపద  ప్రత్యేకతను సగర్వంగా చాటుతున్నాయి. కానీ మానవ  కార్యకలాపాలు, మారుతున్న పర్యావరణ పరిస్థితుల వల్ల ప్రాణి  ప్రపంచం మనుగడ ప్రమాదంలో పడింది. ఇక ఎంతమాత్రం నిర్లక్ష్యం చేసినా అనేక జీవజాతులు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. మనతో పాటు జంతుజాలం స్వేచ్ఛగా జీవించేలా చూడాలనే కనీస ధర్మాన్ని గుర్తించి, అందుకనుగుణమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉంది.  
 
ఇండియన్ జాగ్రఫీ

 
భారతదేశం - జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
   
ఒకప్పుడు స్థానీయమైన అత్యధిక జీవ వైవిధ్యంతో కూడిన భౌగోళిక ప్రదేశాలు ప్రస్తుతం మానవ చర్యల వల్ల ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి ప్రాంతాలను ‘ఎకలాజికల్ హాట్ స్పాట్స్’గా పేర్కొంటున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకూ ఇలాంటి 34 ప్రాంతాలను గుర్తించారు. భారతదేశంలో గుర్తించిన ఎకలాజికల్ హాట్ స్పాట్‌ల సంఖ్య 2. అవి..
     1) ఈశాన్య హిమాలయాలు
     2) పశ్చిమ కనుమలు
 జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి కింద పేర్కొన్న రెండు  రకాల వ్యూహాలను రూపొందించారు.
 1. ఆవాసేతర రక్షణ: ఏదైనా భౌగోళిక ప్రాంతంలో అంతరించి పోయే స్థితిలో ఉన్న జీవజాతులను వాటి సహజ సిద్ధ పరిసరాలకు వెలుపల మానవ ప్రమేయంతో సంరక్షించే విధానాన్ని ‘ఆవాసేతర రక్షణ’ అంటారు.
     ఇందులో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు:
     1)    బోటానికల్ గార్డెన్‌‌స, జంతు ప్రదర్శన శాలలను ఏర్పాటు చేయడం.
     2)    జన్యు బ్యాంకుల ఏర్పాటు.
     3)    బీజ ద్రవ్య బ్యాంకులను ఏర్పాటు చేయడం.
     4)    విత్తన, పిండ నిల్వల బ్యాంకులను ఏర్పాటు చేయడం.
 2. ఆవాసాంతర రక్షణ: ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులను అవే సహజసిద్ధ పరిసరాల్లో సంరక్షించడాన్ని ‘ఆవాసాంతర రక్షణ’ అంటారు.
     దీంట్లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు:
     1) బయోస్పియర్ రిజర్‌‌వల ఏర్పాటు.
     2) జాతీయ పార్కుల ఏర్పాటు.
     3) వన్యమృగ సంరక్షణ కేంద్రాల నిర్వహణ.
 
 బయోస్పియర్ రిజర్‌‌వలు
 ఠి    జంతువులతో పాటు అన్ని రకాల జీవజాతులను పరిరక్షించడానికి వీటిని ఏర్పాటు చేశారు.
 ఠి    భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్‌‌వను 1986లో నీలగిరి (తమిళనాడు)లో ఏర్పాటు చేశారు.
 ఠి    {పస్తుతం మనదేశంలో ఉన్న బయోస్పియర్ రిజర్‌‌వల సంఖ్య 18.
 ఠి    మనదేశంలో చివరగా ప్రకటించిన బయోస్పియర్ రిజర్‌‌వ - ‘పన్నా’. ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. దీన్ని 2011లో ప్రకటించారు.
 ఠి    యునెస్కో జాబితాలో చేర్చిన భారతదేశ బయోస్పియర్ రిజర్‌‌వల సంఖ్య 4. అవి:
     1) నీలగిరి          2) సుందర్‌బన్‌‌స
     3) మన్నార్ సింధుశాఖ   4) నందాదేవి
 ఠి    ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బయోస్పియర్ రిజర్‌‌వ - శేషాచలం (2010)
 
 జాతీయ పార్కులు
 సాధారణంగా వృక్ష, జంతు జాతులు, ప్రకృతి సముదాయాన్ని సంరక్షించి, అభివృద్ధి చేసే ప్రాంతాలను జాతీయ పార్కులు అంటారు. ఈ ప్రాంతాల్లో అడవులను నరకడం, పశువులను మేపడం, వ్యవసాయం చేయడం లాంటి కార్యకలాపాలను ప్రభుత్వం నిషేధించింది.
 ఠి    భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి జాతీయ పార్కు ‘హేలీ’. ఇది ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉంది. దీన్ని 1935లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్ని ‘జిమ్‌కార్బెట్ నేషనల్ పార్కు’గా వ్యవహరిస్తున్నారు.
 ఠి    మనదేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ పార్కుల సంఖ్య 102.
 ఠి    జాతీయ పార్కులు అధికంగా ఉన్న  ప్రాంతాలు:
     1. అండమాన్ - నికోబార్ దీవులు
     2. మధ్యప్రదేశ్
 
 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు
 జంతువుల పరిరక్షణ.. ముఖ్యంగా అంతరించిపోయే ప్రమాదమున్నవాటి కోసమే కేటాయించిన ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ కేంద్రం (శాంక్చుయరీ) అంటారు. ఈ ప్రాంతాల్లో కలప సేకరించడం, అటవీ ఉత్పత్తులను సమీకరించడం లాంటి కార్యకలాపాలతో పాటు ప్రైవేట్ యాజమాన్య హక్కులను అనుమతిస్తారు. ఇక్కడ పరిశోధనలకు ప్రోత్సాహం ఉంటుంది.
 ఠి    వన్యమృగ సంరక్షణ కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలు:
     1. అండమాన్ - నికోబార్ దీవులు
     2. మహారాష్ట్ర
 ఠి    {పస్తుతం దేశంలో ఉన్న వన్య మృగ సంరక్షణ కేంద్రాల సంఖ్య 514.
 ఠి    భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి పక్షి సంరక్షణ కేంద్రం ‘వేదాంతంగల్’. ఇది తమిళనాడులో ఉంది. దీన్ని 1895లో ఏర్పాటు చేశారు.
 ఠి    1972లో ‘వన్యప్రాణి సంరక్షణ చట్టం’ రూపొందించారు. దీని ద్వారా దేశంలో వన్యమృగ సంరక్షణకు చట్టబద్ధత ఏర్పడింది. ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మినహా దేశమంతా వర్తిస్తుంది.
 ఠి    భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, 51(ఎ) లను అనుసరించి వన్యమృగ సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందిస్తోంది.
 1972 వన్యమృగ సంరక్షణ చట్టం ద్వారా భారతదేశంలో అంతరించిపోతున్న జంతువులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టారు. అవి:
 1.    {పాజెక్టు టైగర్: భారతదేశంలో పులులు అంతరించి పోకుండా కాపాడటానికి 1973 ఏప్రిల్ 1న ‘ఆపరేషన్ టైగర్’ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. దీంతోపాటు 9 టైగర్ రిజర్‌‌వలను ప్రకటించారు.
 ఠి    భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి టైగర్ రిజర్‌‌వ ‘బందీపూర్’. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది.
 ఠి    {పస్తుతం దేశంలో మొత్తం 47 టైగర్ రిజర్‌‌వలున్నాయి.
 ఠి    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ‘నాగార్జునసాగర్ - శ్రీశైలం రిజర్‌‌వ’ దేశంలోనే అతి పెద్దది. దీన్ని రాజీవ్‌గాంధీ టైగర్ రిజర్‌‌వగా పిలుస్తారు.
 2.    {పాజెక్టు ఎలిఫెంట్: ఏనుగుల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం 8వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (1992-97) ‘ఆపరేషన్ ఎలిఫెంట్’ను ప్రారంభించింది. దీన్నే ‘కౌండిన్య ప్రాజెక్టు’గా వ్యవహరిస్తారు.
 ఠి    భారతదేశంలో ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం - కేరళ.
 ఠి    {పస్తుతం భారతదేశంలో 32 ఎలిఫెంట్ రిజర్‌‌వలు ఉన్నాయి.
 3.    ఆపరేషన్ క్రోకోడైల్: 1974లో యూఎన్‌డీపీ సహకారంతో ఈ ప్రాజెక్టును ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ప్రారంభించారు. భారతదేశంలో దీన్ని 1975లో ప్రారంభించారు.
 ఠి    దేశంలో మొసళ్ల సంరక్షణ కోసం ‘క్రోకోడైల్ బ్యాంక్’ను ఏర్పాటు చేసిన ప్రాంతం - చెన్నై.
 4.    ఆపరేషన్ సీ-టర్టిల్: తాబేళ్ల సంరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని 1975లో ప్రారంభించారు.
     తాబేళ్లను పరిరక్షిస్తున్న ప్రాంతాలు:
     1) గహిర్మాత, ఒడిశా - ఆలివ్‌రిడ్లీ తాబేళ్లు
     2) ట్యుటికోరిన్, తమిళనాడు - హాక్సీబిల్ తాబేళ్లు.
 
  ముఖ్యమైన టైగర్ రిజర్‌‌వలు - రాష్ట్రాలు
 1. కజిరంగా టైగర్ రిజర్‌‌వ - అసోం
 2. మానస టైగర్ రిజర్‌‌వ - అసోం
 3. కవ్వాల్ టైగర్ రిజర్‌‌వ -  తెలంగాణ
 4. వాల్మీకి టైగర్ రిజర్‌‌వ - బీహార్
 5. బందీపూర్ టైగర్ రిజర్‌‌వ - కర్ణాటక
 6. పెరియార్ టైగర్ రిజర్‌‌వ - కేరళ
 7. పన్నా టైగర్ రిజర్‌‌వ - మధ్యప్రదేశ్
 8. బాందవ్‌ఘర్ టైగర్ రిజర్‌‌వ - మధ్యప్రదేశ్
 9. కన్హా టైగర్ రిజర్‌‌వ - మధ్యప్రదేశ్
 10. సిమ్లిపాల్ టైగర్ రిజర్‌‌వ - ఒడిశా
 11.    రణతంబోర్ టైగర్ రిజర్‌‌వ - రాజస్థాన్
 12.    దుద్వా టైగర్ రిజర్‌‌వ - ఉత్తరప్రదేశ్
 13.    జిమ్ కార్బెట్ టైగర్ రిజర్‌‌వ - ఉత్తరాంచల్
 14.    బుక్సా (బక్సార్) టైగర్ రిజర్‌‌వ - పశ్చిమ బెంగాల్
 15. సుందర్ బన్‌‌స(24 పరగణాలు) టైగర్ రిజర్‌‌వ -  పశ్చిమ బెంగాల్
 
 ముఖ్యమైన జాతీయ పార్కులు,
 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు
 1.    జమ్మూ-కాశ్మీర్: 1) దచిగామ్ (హంగుల్ అనే దుప్పిని సంరక్షిస్తున్నారు)
     2) సలీం అలీ (పక్షి సంరక్షణ కేంద్రం)
 2.    ఉత్తరాంచల్:    1) రాజాజీ
     2) నందాదేవి    3) గంగోత్రి
 3.    పశ్చిమ బెంగాల్: 1) జల్దపార (ఖడ్గమృగాల సంరక్షణ కేంద్రం)
     2) నిమోరా (పెద్దపులి సంరక్షణ కేంద్రం)
 4.    కర్ణాటక: 1) రంగన్ తిట్టూ
     2) బన్నార్ గట్టి (సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం)    3) బందీపూర్
 5.    మహారాష్ట్ర: 1) బోర్‌విల్లీ (అరిచే జింకల సంరక్షణ కేంద్రం). దీన్ని సంజయ్‌గాంధీ నేషనల్ పార్కు అని కూడా అంటారు.
     2) నవగావ్
 6.    గుజరాత్: 1) ససన్‌గిర్ (ఆసియా సింహాలను సంరక్షిస్తున్నారు)
     2) వైల్డ్ యాస్ పార్కు (కంచర గాడిదల సంరక్షణ కేంద్రం)
     3) గిర్ నేషనల్ పార్కు
 7.    రాజస్థాన్: 1) డిజర్‌‌ట
     2) కియోల్‌దేవ్ ఘనా/ భరత్‌పూర్ (సైబీరియన్ కొంగల సంరక్షణ కేంద్రం)
 8.    మధ్యప్రదేశ్:   1) శివపురి     2) మాధవ్
 9.    అసోం: 1) కజిరంగా (1905లో లార్‌‌డ కర్జన్ ఏర్పాటు చేశాడు. ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణ కేంద్రం)
     2) దిబ్రూ సైకోవా
 
 గతంలో అడిగిన ప్రశ్నలు
 
 
 
 1.    బక్సార్ పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?     (డిప్యూటీ జైలర్‌‌స-2012)    
     1) రాజస్థాన్    2) మధ్యప్రదేశ్
     3) బీహార్    4) పశ్చిమ బెంగాల్
 2.    భారతదేశంలో ఏ రాష్ట్రంలో ‘ఘన’ పక్షి సంరక్షణ కేంద్రం ఉంది?    (ఎస్.ఐ. -2012)    1) ఒడిశా    2) కర్ణాటక
     3) రాజస్థాన్    4) పశ్చిమ బెంగాల్
 3.    బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది?    (ఎస్.ఐ. -2011)    
     1) మధ్యప్రదేశ్    2) రాజస్థాన్
     3) బీహార్    4) ఒడిశా
     5) ఉత్తరప్రదేశ్
 4.    రాజాజీ జాతీయ పార్కుగా పేరు పొందిన పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
     (ఎస్.ఐ. -2011)
     1) ఉత్తరాఖండ్    2) మధ్యప్రదేశ్    3) రాజస్థాన్    4) బీహార్
     5) జమ్మూ - కాశ్మీర్
 5.    {Mూర ప్రాణుల సంరక్షణ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?
     (ఎస్.ఐ. -2011)    
     1) 1970    2) 1974    3) 1968
     4) 1980    5) 1972
 
 సమాధానాలు
     1) 4;    2) 3;    3) 1;
     4) 1;    5) 5.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement