బరిలో వీరు...గెలిచేదెవరో! | who is win in Cantonment elections | Sakshi
Sakshi News home page

బరిలో వీరు...గెలిచేదెవరో!

Published Fri, Dec 19 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

బరిలో వీరు...గెలిచేదెవరో!

బరిలో వీరు...గెలిచేదెవరో!

కేంద్ర మాజీ మంత్రి సర్వే  కుమారుడు, కుమార్తె
ఎమ్మెల్యే సాయన్న కూతురు
ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సతీమణి మంజుల
రసవత్తరంగా కంటోన్మెంట్ ఎన్నికలు
 

కంటోన్మెంట్ :  దీంతో ఎనిమిది వార్డుల నుంచి మొత్తం 114 మంది బరిలో నిలిచినట్లయింది. రాష్ట్ర రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్న ప్రముఖ నేతల వారసులు ఈసికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు మొత్తం 173 మంది నామినేషన్లు దాఖలు చేయగా, శుక్రవారం 59 మంది ఉపసంహరించుకున్నారు.సారి పెద్ద సంఖ్యలో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. దీనితో అందరి దృష్టి ఈ ఎన్నికల పైనే పడింది. రెండోవార్డు నుంచి సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసిని, ఐదో వార్డు నుంచి సర్వే కుమారుడు ఎస్. నవనీత్ పోటీ పడుతున్నారు. కంటోన్మెంట్ మాజీ ఉద్యోగి, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి భార్య మంజుల రెడ్డి రెండు, ఏడు వార్డుల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఆమె 2006లో బోర్డు ఎన్నికల్లో గెలుపొంది, మూడు నెలల పాటు బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. మళ్లీ ఈసారి బరిలోకి దిగుతుండటం స్థానికంగా ఆసక్తి కలిగిస్తోంది. ఎమ్మెల్యే సాయన్న తన కుమార్తె జి.లాస్య నందితను నాలుగో వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలిపారు. వీరితో పాటు కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డి.నర్సింగ్‌రావు కుమారుడు డీఎన్ సంజీవరావు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్‌రెడ్డి కుమారుడు కనుకుల తిరుపతి రెడ్డి రెండో వార్డు నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డికి మేనల్లుడు కూడా. ఇక రెండో వార్డు నుంచి తిరిగి పోటీ చేస్తున్న మాజీ బోర్డు సభ్యుడు సాద కేశవరెడ్డి, ఒకటో వార్డు నుంచి బరిలో ఉన్న జక్కుల మహేశ్వర్‌రెడ్డిలు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి సమీప బంధువులు. వీరితో పాటు స్థానిక బోర్డు సభ్యుల వారసులు పెద్ద సంఖ్యలో కంటోన్మెంట్ ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకునే యత్నాల్లో ఉన్నారు. ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో వేచి చూడాలి.
 
వార్డుకో మంత్రికి ఇన్‌ఛార్జి బాధ్యతలు

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ వార్డుకో మంత్రికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. త్వరలో వార్డుల వారీగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహం రచించేందుకు మంత్రులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అమాత్యులంతా కంటోన్మెంట్ ప్రచారానికి తరలిరానుండడంతో బోర్డు ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement