'దిసీజ్ మోరల్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్ సీపీ' | ys jagan mohan reddy comments on appropriation bill | Sakshi
Sakshi News home page

'దిసీజ్ మోరల్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్ సీపీ'

Published Wed, Mar 30 2016 5:48 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

'దిసీజ్ మోరల్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్ సీపీ' - Sakshi

'దిసీజ్ మోరల్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్ సీపీ'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై డివిజన్కు అంగీకరించి ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు పోయేవని, అందుకే డివిజన్కు వ్యతిరేకించారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదాపడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు అవినీతి సొమ్ముతో కొన్న ఎమ్మెల్యేలను రక్షించే ప్రయత్నం చేశారని, వారితో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని విమర్శించారు. 'దిసీజ్ మోరల్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్ సీపీ' అని వైఎస్ జగన్ అన్నారు. ఇంకా ఏం మాట్లాడారంటే..
 

  • ఏపీ ప్రభుత్వం రూ. 22 వేల కోట్ల పబ్లిక్ డిపాజిట్లను సేకరించింది
  • ఎఫ్ఆర్బీఎం ప్రకారం 3 శాతం జీఎస్డీపీ దాటి డిపాజిట్లు తీసుకునే అవకాశం లేదు
  • కేంద్రం, ఆర్బీఐ అంగీకరించకున్నా చంద్రబాబు అత్తగారి సొత్తన్నట్టు పబ్లిక్ డిపాజిట్లను వాడుకున్నారు
  • చంద్రబాబు చేసింది చట్టప్రకారం జైలుకు వెళ్లే నేరం
  • ద్రవ్యవినిమయ బిల్లును మేం వ్యతిరేకించడానికి ఇంతకంటే కారణం ఏం కావాలి?
  • 2014-15 ఆడిట్ లెక్కలను బడ్జెట్లో చూపలేదు
  • రూ.22 వేల కోట్లు పక్కదారిపట్టినందువల్లే ఈ లెక్కలు బడ్జెట్లో చూపలేదు
  • రుణమాఫీ, ఫించన్లు, హౌసింగ్, ఫీజు రీయింబర్స్మెంట్ అన్ని పద్దుల్లోనూ ఖర్చులు, కేటాయింపుల్లో వ్యత్యాసం ఉంది
  • అందుకే ద్రవ్యవినిమయ బిల్లును వ్యతిరేకించాం
  • డివిజన్కు స్పీకర్ అనుమతించకపోవడం అన్యాయం
  • డివిజన్ అడిగితే ఇవ్వాలనేది రాజ్యాంగ నిబంధన
  • నేను నిబంధనలను చదివి వినిపించినా స్పీకర్ పట్టించుకోలేదు
  • స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారు
  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రక్షించే ప్రయత్నం చేశారు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement