Appropriation Bill
-
చట్టవ్యతిరేక పనులను సహించం
-
జగన్ మొదటి బడ్జెట్.. మనసున్న బడ్జెట్
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ఈ చర్చలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ను మనస్సున్న బడ్జెట్‌గా అభివర్ణించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకుంటున్నారని కొనియాడారు. ప్రజా సమస్యలను గమనించి.. వాటి పరిష్కారానికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ శూన్యమని, చంద్రబాబు హయాంలో భూకుంభకోణాలు, కాల్‌మనీ సెక్స్ రాకెట్లు వంటి దుర్మార్గాలు జరిగాయని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని తిరస్కరిస్తూ ప్రజలు గట్టిగా తీర్పు ఇచ్చినా.. ఆయనలో ప్రశ్చాత్తాపం కనిపించడం లేదని అన్నారు. చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో సంక్షేమం సున్నా అని, సీఎంగా బాబు పెట్టిన మొదటి సంతకాన్ని కూడా అమలు చేయలేదని అన్నారు. అభివృద్ధి,సంక్షేమానికి కేరాఫ్ దివంగత మహానేత వైఎస్సార్ అని గుర్తు చేశారు. బాబు తన ఇంటికే ఉద్యోగం ఇచ్చుకున్నారు పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కాకాణి గోవర్థన్‌రెడ్డి కొనియాడారు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని నిరుద్యోగులను మభ్యపెట్టిన చంద్రబాబు తన హయాంలో తన ఇంటికి మాత్రమే ఉద్యోగం కల్పించారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తానని చెప్పి.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు హామీ చేసి మోసం చేయాలని చూశారని మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐదు సంతకాలు చేశారని, కానీ అవి అమలుకు నోచుకోలేదన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారని, తన తుదిశ్వాస విడిచేవరకు రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత వైఎస్సార్‌ది అని కొనియాడరు. రైతును రాజును చేసిన ఘనత వైఎస్సార్‌ది అన్నారు. రైతుల సంక్షేమం విషయంలో వైఎస్సార్ విధానాలను సీఎం జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు. వ్యవసాయం గురించి ఆలోచించి చరిత్రలో నిలిచిపోయారు కనుకే వైఎస్సార్ జయంతి నాడు రైతుదినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి అమలు చేయబోతున్నామని, రూ. 12,500 చొప్పున నాలుగు దశల్లో రూ. 50వేల రైతులకు అందజేస్తామని తెలిపారు. ఈ పథకం అమలు కోసం మొట్టమొదటిబడ్జెట్‌లోనే నిధులు కేటాయించారని తెలిపారు. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసినట్టు తెలిపారు. అమలు సాధ్యం కాదని తెలిసినా రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు తరహాలో రుణమాఫీ హామీ ఇచ్చి.. మోసపూరితంగా అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ 2014 ఎన్నికల్లో భావించలేదని, ఆచరణకుసాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలనుకోవడం లేదని, ఈ విషయంలో ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా సిద్ధమేనని అన్నారని, అలా ప్రతిపక్షంలో ఉండి.. ప్రజల మెప్పుతో వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చారని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా పథకంతోపాటు రైతులకు వడ్డీలేని రుణాలు, వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, వైఎస్సార్ పంటల బీమ పథకం, ఆక్వా రైతులకు రూ.1.50 యూనిట్ విద్యుత్ తదితర రైతు సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. -
‘మూజువాణి’తోనే సరి
♦ ద్రవ్య వినిమయ బిల్లుపై ‘డివిజన్’కు విపక్షం పట్టు ♦ కుదరదన్న యనమల.. ససేమిరా అన్న స్పీకర్ ♦ ఓటింగ్ పెట్టకుండా తప్పించుకున్న వైనం ♦ మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం.. సభ నిరవధిక వాయిదా సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అధికార పక్షం మరోసారి సభలో ‘డివిజన్’కు వెనుకంజ వేసింది. బుధవారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి మూజువాణి ఓటుతోనే సరిపెట్టింది. డివిజన్ కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ గట్టిగా పట్టుబట్టినా.. ద్రవ్య వినిమయ బిల్లుపై మూజు వాణి ఓటే తప్ప డివిజన్‌కు అవకాశం లేదని సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ నుంచి జారిపోతున్న వారిని కట్టడి చేయడానికే ప్రతిపక్షం డివిజన్ అడుగుతోందంటూ.. అధికార పక్షం వెనుకంజ వేయడానికి కారణాన్ని చెప్పకనే చెప్పారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా డివిజన్‌కు ససేమిరా అన్నారు. డివిజన్ (అనుకూలురెందరు, వ్యతిరేకిస్తున్నవారెందరు లెక్కించేందుకు నిర్వహించే ప్రక్రియ) అడిగినప్పుడు ఇవ్వడం రాజ్యాంగ ధర్మమని పేర్కొంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి.. కౌల్ అండ్ షక్దర్ రాసిన ప్రామాణిక నిబంధనల పుస్తకంలోని అంశాలను చదివి వినిపించే ప్రయత్నం చేసినా.. పూర్తి చేయడానికి స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. విపక్ష నేత చెప్పిన నిబంధనను స్పీకర్ ప్రస్తావిస్తూ.. డివిజన్‌కు సంబంధించిన ప్రక్రియను చెబుతున్నారని, అది ద్రవ్య వినిమయ బిల్లుకు వర్తించదని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లు ఒక్కటే కాదు.. సభ ఆమోదం కావాల్సిన ఎలాంటి అంశంపై డివిజన్ కోరినా ఇవ్వాల్సిందేనని నిబంధనల్లో స్పష్టంగా ఉందని జగన్ పేర్కొన్నారు. విపక్ష నేత మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేశారు. ఈ దశలో మరోసారి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని విపక్ష నేత అడిగారు. మైక్ ఇవ్వగానే.. ‘ఇంత దారుణమైన పరిస్థితుల్లో సభను నడిపిస్తున్నారు. వేరే పార్టీ బీ ఫామ్‌లపై గెలిచిన వారిని తీసుకుంటున్నారు. అవినీతి డబ్బుతో కొనుగోలు చేస్తున్నారు..’ అని అంటుండగానే మైక్ కట్ అయింది. డివిజన్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. గందరగోళ పరిస్థితుల మధ్య.. ద్రవ్య వినిమయ బిల్లుపై స్పీకర్ మూజువాణి ఓటు నిర్వహించి, బిల్లుకు సభ ఆమోదం లభించిందని ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. వాటికి పొంతనలేదు: కాకాణి అంతకుముందు ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో విపక్ష వైఎస్సార్సీపీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, చెబుతున్న మాటలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతన లేదని విమర్శించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సబంధించిన ఆడిట్ చేసిన నివేదికలను ఎందుకు సమర్పించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలవరం తొలిదశను 2018లోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, తొలి దశ అంటే పట్టిసీమేనా అని ప్రశ్నించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావులు.. ఈ అంశాలపై సమాధానాలు ఇవ్వడం కంటే విపక్షనేత జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఉద్యోగాలన్నీ భర్తీ చేయలేం: యనమల ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయబోమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మరోసారి స్పష్టం చేశారు. అయితే 20 వేల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఉద్యోగార్థుల గరిష్ట వయో పరిమితిని 45ఏళ్లకు పెంచడానికి సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చా రు. జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3 శాతం దాటలేదని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లు మీద డివిజన్‌కు అవకాశం లేదని, దేశ చరిత్రలో డివిజన్‌కు వెళ్లిన సందర్భాలు లేవన్నారు.దీనిపై స్పీకర్‌కు వారం క్రితం విపక్షం రాసిన లేఖకు విలువ లేదన్నారు. -
పథకాలకు డబ్బు లేనపుడు మంజూరెలా ఇస్తారు?
- మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్న - కేజీ టు పీజీపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ - క్రమబద్ధీకరణ ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో తెలపాలని మజ్లిస్ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమని చెబుతున్న పథకాలకు మీదగ్గర డబ్బులేనపుడు ఆయా పథకాలకు పరిపాలన మంజూరెలా ఇస్తారని తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. బుధవారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథకు గానీ, డబుల్బెడ్రూం పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తెస్తామని ప్రభుత్వం చెబుతోంద న్నారు. అయితే.. ఎటువంటి రెవెన్యూ రాని పథకాల కోసం తెచ్చే రూ.79వేలకోట్ల రుణాన్ని తిరిగి ఎలా చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గత రెండు బడ్జెట్లలోనూ అంచనాలకు, వ్యయానికి ఎంతో వ్యత్యాసం ఉందని, తాజా బడ్జెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుందన్న షబ్బీర్.. హౌసింగ్ కోసం రుణమిస్తానంటున్న హడ్కో సంస్థ 2014-15లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.21వేలకోట్లు ఇస్తామని చెప్పి తీరా విడుదల చేసింది రూ.8వేలకోట్లేనన్న సంగతిని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ ఏడాది 2.60లక్షల డబుల్బెడ్రూం ఇళ్లు కట్టే పరిస్థితి కనిపించడం లేదన్నారు. 7గంటల ఉచిత విద్యుత్ కోసం రూ.4వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 9గంటల ఇస్తామని చేసిన ప్రకటన మేరకు ఎందుకు కేటాయింపులు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలపై ఎటువంటి పన్నుల భారం మోపమని మేనిఫెస్టోలో చెప్పి, తాజాగా విద్యుత్ చార్జీల రూపంలో రూ.2వేలకోట్లు, ఎఫ్‌ఎస్‌ఏల రూపంలో మరో రూ.3వేలకోట్లు భారాన్ని ప్రభుత్వం వేస్తోందన్నారు. ఏదైనా ప్రాజెక్ట్‌లో రూ.4వేలకోట్లు తగ్గించుకొని రుణమాఫీకి కేటాయిస్తే, రాష్ట్రంలోని రైతులందరూ రుణవిముక్తులవుతారని, రైతుల కోసం చేసిన సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. జనాభాలో 70శాతం ఉన్న రైతాంగానికి సబ్సిడీలు మరింత పెంచాలని, విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాలకు అదన ంగా నిధులు కేటాయించాలని సూచించారు. ఆచరణాత్మకంగా ఉండాలి.. బడ్జెటోల నిధుల కేటాయించకుండా, బయటి నుంచి రాబడి లేకుండా 2.60లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు క డతామని ప్రభుత్వం చేసిన ప్రకటనలో ప్రజలకు ఎన్నో ఆనుమాలున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు అన్నారు సంక్షేమ పథకాలు ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కేజీటుపీజీ ప్రోగ్రామ్‌కు గతేడాది కేటాయించిన నిధుల్లో సగానికి సగం నిధులు కూడా ఖర్చు చేయకపోవడమే సర్కారు చిత్తశుద్ధిని తెలుపుతోందన్నారు. నాన్‌ప్లాన్‌లో పెట్టిన రూ.1036కోట్లతో విద్యారంగాన్ని ఎలా తీర్చిదిద్దగలరని ప్రశ్నించారు. మజ్లీస్ ఎమ్మెల్సీ రిజ్వీ మాట్లాడుతూ..ప్రభుత్వం బడ్జెట్లో చూపిన అంకెలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. భూముల క్రమబద్దీకరణ విషయమై జీవో 59 కింద ఎన్ని దరఖాస్తులకు ఆమోదం తెలిపారు, ఎన్నింటినీ తిరస్కరించారు, ఎంత రాబడి వచ్చిందో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. వక్ఫ్ ట్రిబ్యునల్‌కు పూర్తిస్థాయి జడ్జిని నియమించాలని, హైదరాబాద్‌లో తాగునీటి అవసరాల కోసం సమ్మర్ యాక్షన్ ప్లాన్ నిధులను రూ.40కోట్ల నుంచి రూ.100కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు వివిధ పథకాల కింద రూ.1204కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇంకా ఈ చర్చలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు. -
'దిసీజ్ మోరల్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్ సీపీ'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై డివిజన్‌కు అంగీకరించి ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు పోయేవని, అందుకే డివిజన్‌కు వ్యతిరేకించారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదాపడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులు అవినీతి సొమ్ముతో కొన్న ఎమ్మెల్యేలను రక్షించే ప్రయత్నం చేశారని, వారితో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని విమర్శించారు. 'దిసీజ్ మోరల్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్ సీపీ' అని వైఎస్ జగన్ అన్నారు. ఇంకా ఏం మాట్లాడారంటే.. ఏపీ ప్రభుత్వం రూ. 22 వేల కోట్ల పబ్లిక్ డిపాజిట్లను సేకరించింది ఎఫ్ఆర్బీఎం ప్రకారం 3 శాతం జీఎస్డీపీ దాటి డిపాజిట్లు తీసుకునే అవకాశం లేదు కేంద్రం, ఆర్బీఐ అంగీకరించకున్నా చంద్రబాబు అత్తగారి సొత్తన్నట్టు పబ్లిక్ డిపాజిట్లను వాడుకున్నారు చంద్రబాబు చేసింది చట్టప్రకారం జైలుకు వెళ్లే నేరం ద్రవ్యవినిమయ బిల్లును మేం వ్యతిరేకించడానికి ఇంతకంటే కారణం ఏం కావాలి? 2014-15 ఆడిట్ లెక్కలను బడ్జెట్లో చూపలేదు రూ.22 వేల కోట్లు పక్కదారిపట్టినందువల్లే ఈ లెక్కలు బడ్జెట్లో చూపలేదు రుణమాఫీ, ఫించన్లు, హౌసింగ్, ఫీజు రీయింబర్స్మెంట్ అన్ని పద్దుల్లోనూ ఖర్చులు, కేటాయింపుల్లో వ్యత్యాసం ఉంది అందుకే ద్రవ్యవినిమయ బిల్లును వ్యతిరేకించాం డివిజన్‌కు స్పీకర్ అనుమతించకపోవడం అన్యాయం డివిజన్ అడిగితే ఇవ్వాలనేది రాజ్యాంగ నిబంధన నేను నిబంధనలను చదివి వినిపించినా స్పీకర్ పట్టించుకోలేదు స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రక్షించే ప్రయత్నం చేశారు -
నిరసనల మధ్య ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్య ద్రవ్యవినిమయ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సభను నిరవధికంగా వాయిదా వేశారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని, ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ద్రవ్యవినిమయ బిల్లుపై డివిజన్ అడిగే హక్కు తమకుందని చెప్పారు. అధికార టీడీపీ అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా ఈ బిల్లుపై డివిజన్ ఓటింగ్ చేపట్టాలన్న వైఎస్ఆర్ సీపీ డిమాండ్‌ను స్పీకర్ తిరస్కరించారు. ఓటింగ్‌పై నిపుణులతో చర్చించానని, ద్రవ్యవినిమయ బిల్లుపై సవరణలు కూడా చేపట్టరాదని స్పీకర్ చెప్పారు. సభలో వైఎస్ఆర్ సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండగానే ద్రవ్యవినిమయ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
'చంద్రబాబును నమ్మి బాధపడుతున్నారు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మి మోసపోయామని రైతులు బాధపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. రైతుల రుణమాఫీపై ఎన్నో ఆంక్షలు విధించారని విమర్శించారు. వ్యవసాయ రుణాలమాఫీపై చంద్రబాబు చేసిన తొలిసంతకం పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో కాకాని మాట్లాడుతూ.. గత బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేదని అన్నారు. ద్రవ్యవినిమయ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. 2014-15 బడ్జెట్ లెక్కలు ఎందుకు దాచిపెట్టారని కాకాని ప్రశ్నించారు. 2016-17 బడ్జెట్ ప్రసంగం అంతా తప్పుల తడకేనని విమర్శించారు. జీడీపీ రేటుపై కూడా అనుమానాలున్నాయని పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారని చెప్పారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారని, తుదిశ్వాస విడిచే వరకు దాన్ని కొనసాగించారని గుర్తుచేశారు. రైతుల రుణమాఫీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మాటతప్పిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మకంగా లేవని అన్నారు. -
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ Part 3
-
శాసన మండలిలో తీవ్ర గందరగోళం
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో గురువారం తీవ్ర గందరగోళం నెలకొంది. ఆగంతుక నిధి పెంచాలని విపక్షాలు కాంగ్రెస్, టీడీపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో సభలో విపక్షాలు నిరసనకు దిగాయి. అయితే అధికార పక్షం మాత్రం ఇవేమీ పట్టించుకోక పోవడం.... ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు. దాంతో ఛైర్మన్ పోడియం ముందు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దాంతో శాసనమండలిని ఛైర్మన్ ఆరగంట పాటు వాయిదా వేశారు. తెలంగాణ శాసనసభ, మండలిలో ద్రవ్య వినిమయ బిల్లును గురువారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ Part 1
-
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ Part 2
-
ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ఉత్తమ్
హైదరాబాద్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. తెలంగాణ శాసనసభలో శుక్రవారం ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. నీరు, విద్యుత్ లేక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. హైదరాబాద్ ఆదాయం వల్లే ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. -
నేడు అసెంబ్లీ, మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లును శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఉభయసభల్లో సవరణల ద్వారా ఓటింగ్‌కు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు కాంగ్రెస్, టీడీపీలు భావిస్తున్నాయి. అందుకోసం ఇప్పటికే ఆ పార్టీలు విప్ జారీ చేశాయి. అలాగే కాగ్ నివేదికను కూడా ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అందుకోసం ఉదయం 9 గంటలకే అసెంబ్లీకి చేరుకోవాలని అధికారపక్షం సభ్యులను ఆదేశించింది. రేపటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. -
పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ
హైదరాబాద్ : పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ గురువారం విప్ జారీ చేసింది. ద్రవ్య వినిమయ బిల్లుపై రేపు అసెంబ్లీలో జరిగే ఓటింగ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ విప్లో పేర్కొంది. ఈ విషయంపై తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినట్లు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు సభలో విప్ అందచేశామన్నారు. విప్‌ను ఉల్లంఘించాలనుకుంటే పదవులుకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సండ్ర వెంకట వీరయ్య సూచించారు.