
జక్కంపూడికి వైఎస్ జగన్ ఘన నివాళి
హైదరాబాద్ : మాజీ మంత్రి, దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం జక్కంపూడి 62వ జయంతి సందర్భంగా లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో విజయ సాయిరెడ్డి, సాగి దుర్గాప్రసాదరాజు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
మరోవైపు జక్కంపూడి జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, రాజమండ్రి నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి తెలిపారు.