కారకాస్: వెనిజులాలో బస్సు ప్రమాదం సంభంవించి 11 మంది మృతిచెందారు. 36 మంది గాయాలపాలయ్యారు. దాదాపు 50 మందితో బయలుదేరిన బస్సు ఒకటి వెలన్సియా వెళుతుండగా అనుకోకుండా నియంత్రణ తప్పింది. వెంటనే రోడ్డు నుంచి పక్కకు జారీపోయే అక్కడే ఉన్న ఓ నీటి కొలనులో పడిపోయింది. దీంతో ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయ సిబ్బంది రంగంలోకి దిగి బస్సులో చిక్కుకున్నవారిని ఎంతో శ్రమతో బయటకు తీశారు.