ఘోర ప్రమాదం : 15 మంది హాకీ ఆటగాళ్ల మృతి   | 15 Hockey Players Died In Bus Accident In Canada | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం : 15 మంది హాకీ ఆటగాళ్ల మృతి  

Published Sun, Apr 8 2018 11:11 PM | Last Updated on Sun, Apr 8 2018 11:13 PM

15 Hockey Players Died In Bus Accident In Canada - Sakshi

హంబోల్డ్‌ : కెనడాలో జరిగిన రోడ్డుప్రమాదం హాకీ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటన సస్కచెవాన్‌ ప్రావిన్సులో శనివారం జరిగింది. జూనియర్‌ ఐస్‌ హాకీ జట్టుతో వెళుతున్న బస్సు మార్గమధ్యంలో సెమీ ట్రైలర్‌ ట్రక్కును ఢీకొంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో టిస్‌డేల్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 15 మంది చనిపోగా మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.  క్షతగాత్రుల్లో డ్రైవర్‌ కూడా ఉన్నాడు. అయితే మృతుల్లో 24 మంది ఆటగాళ్లు. వీరి వయసు 16 నుంచి 21లోపే. ఈ ఘటన దేశాన్ని తీవ్రంగా కలచివేసిందని ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement