కుప్పకూలిన సైనిక విమానం, 22 మంది మృతి | 22 killed in Ecuador military plane crash | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన సైనిక విమానం, 22 మంది మృతి

Published Wed, Mar 16 2016 3:41 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

22 killed in Ecuador military plane crash

క్విటో: దక్షిణ అమెరికా ఈక్వెడార్‌కు చెందిన ఓ సైనిక విమానం పాస్తజా ప్రావిన్స్ లో  కుప్పకూలింది. షెల్‌ మీరా ప్రాంతంలో జరిగిన ఈ  ప్రమాదంలో 22 మంది ప్రయాణికులు  దుర్మరణం  చెందారు. మంగళవారం సైనికుల నిర్వహిస్తున్నపారాచూట్ విన్యాసాలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో 19 మంది సైనికులు, ఇద్దరు వైమానిక సిబ్బంది, ఓ మెకానిక్‌ ఉన్నారు.

పైలట్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా  అనుమతి కోరిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలినట్టు  ఈక్వెడార్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  అటు ఈ విమాన ప్రమాదాన్ని ఈక్వడార్ అధ్యక్షుడు రాఫెల్ కొరియా తన అధికారిక ట్విట్టర్ లో ధ్రువీకరించారు. ఏ రకం విమానమో, ప్రమాదం ఎలా సంభవించిందో పేర్కొనలేదు. అయితే ఈ ప్రమాదంలో అందరూ చనిపోయినట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement