మలాలా కేసులో నేరస్తులకు 25 ఏళ్ల జైలు | 25 years prison on malala case | Sakshi
Sakshi News home page

మలాలా కేసులో నేరస్తులకు 25 ఏళ్ల జైలు

Published Fri, May 1 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

2012లో పాకిస్తాన్‌లో బాలికల విద్య కోసం పోరాటం చేసిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌పై దాడిచేసిన 10 మంది తాలిబన్ మిలిటెంట్లకు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు (ఏటీసీ) 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

పెషావర్: 2012లో పాకిస్తాన్‌లో బాలికల విద్య కోసం పోరాటం చేసిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌పై దాడిచేసిన 10 మంది తాలిబన్ మిలిటెంట్లకు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు (ఏటీసీ) 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌లోని స్వాత్ జిల్లాలో ఉన్న ఏటీసీ జడ్జి గురువారం నేరస్తులకు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని జిల్లా అధికారి ఒకరు చెప్పారు.

2012 అక్టోబర్‌లో స్వాత్ లోయలో 15 ఏళ్ల మలాలా స్కూలు బస్సులో వెళ్తుండగా మిలిటెంట్లు బస్సులోకి చొరబడి తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు బాధ్యత తమదేనని తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు అప్పుడే ప్రకటించారు. ఈ దాడి ప్రధాన నిందితుడు అతుల్లా ఖాన్ (23) అని పోలీసులు పేర్కొన్నప్పటికీ శిక్ష పడిన 10 మందిలో అతడి పేరులేకపోవడం గమనార్హం.

Advertisement

పోల్

Advertisement