మృతుల్లో డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ సహా ఎక్కువ మంది పోలీసులే
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో మొహిబుల్లా అనే పోలీసు అధికారి అం త్యక్రియల కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి లో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు సహా 38 మంది మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. మరణించినవారిలో ఎక్కువ మంది పోలీసు సిబ్బంది, చిన్నారులే. అయితే.. మొహిబుల్లాను కూడా గురువారం ఉదయమే గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఆయన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బంది హాజరుకాగా.. ఆత్మాహుతి దాడి జరిగింది. మళ్లీ దాడి జరగవచ్చనే భయంతో.. క్షతగాత్రులను సాధారణ ఆస్పత్రికి కాకుండా మిలటరీ ఆస్పత్రికి తరలించారు.
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 38 మంది మృతి
Published Fri, Aug 9 2013 6:32 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement