మెక్సికన్ డ్రగ్ మాఫియా హత్యాకాండ
మెక్సికో సిటీ: మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారంలో ప్రపంచ రాజధానిగా పేరు మోసిన మెక్సికోలో మాఫియా మరోసారి హత్యాకాండకు దిగింది. దక్షిణ మెక్సికోలోని ఆక్సెకా రాష్ట్రంలో పాశవిక హత్యకు గురైన ఎనిమిది మృతదేహాలను స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసోలాపా పట్టణ శివారులో ఓ వ్యాన్ నుంచి ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సమీపంలోనే మరో రెండిటిని గుర్తించారు.
అన్ని శవాలకు కాళ్లూ చేతులు కట్టేసి ఉన్నాయని, గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతుకోసి చంపేశారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ మాఫియా గ్రూపుల మధ్య విబేధాలతో మెక్సికోలో ఇలాంటి సంఘటనను నిత్యం జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు మాఫియా చేతిలో హత్యకు గురైన లేదా కనిపించకుండా పోయిన వారి సంఖ్య లక్షకు పైనే ఉంటుందని అంచనా.