ఫ్లైట్‌లో ఆయనగారి దర్జా చూస్తే షాకే! | A disgruntled passenger took to social media to shame the man sitting next to him | Sakshi
Sakshi News home page

ఫ్లైట్‌లో ఆయనగారి దర్జా చూస్తే షాకే!

Published Sat, Dec 31 2016 11:43 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM

A disgruntled passenger took to social media to shame the man sitting next to him

కుమేల్‌ నంజియాని అనే వ్యక్తి ఇటీవల ఓ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఫ్లైట్‌నే తన ఇంటిగా మార్చుకొని ఎంత దర్జాగా.. ఇతరులకు అసౌకర్యం కలిగించాడో చెబుతూ కుమేల్ చేసిన ట్వీట్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

విమాన ప్రయాణంలో కుమేల్‌కు ఆరోజు దురదృష్టవశాత్తు ముందు సీటు లభించింది. ఫ్లైట్‌ టేకాఫ్‌ కాగానే.. పక్కన కూర్చున్న వ్యక్తి చకచకా తన ప్యాంటు విప్పేసి ముందున్న వాల్‌పై తన రెండు కాళ్లు పెట్టుకొని కూర్చున్నాడు. అది మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఉందని చెప్పినా ఆ వ్యక్తి వినిపించుకోలేదని కమేల్‌ తన ట్వట్లలో వాపోయాడు. సిబ్బంది చెప్పిన విషయాన్ని సైతం అతడు పట్టించుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాడని.. చివరికి నాలుగు గంటల ప్రయాణం తరువాత.. ఫ్లైట్‌ ల్యాండ్‌ అయ్యాక ప్యాంటు వేసుకొని అతడు బయటకు నడిచాడని కుమేల్‌ వెల్లడించాడు. సిబ్బంది ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్‌ చేస్తారని తాను భావించానని అయితే.. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమేల్‌ వాపోయాడు. ఫ్లైట్‌లలో కొందరు వ్యక్తులు సైకోల మాదిరిగా ప్రవర్తిస్తుండటంతో ఇటీవల దక్షిణ కొరియా ఎయిర్‌లైన్స్‌.. సిబ్బందికి స్టన్ గన్స్‌ను ఇచ్చే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement