ఈ పెళ్లి కూతురు డ్యాన్స్‌ 15లక్షలమంది చూశారు | A Million Views For This Bride's Bollywood Dance | Sakshi
Sakshi News home page

ఈ పెళ్లి కూతురు డ్యాన్స్‌ 15లక్షలమంది చూశారు

Published Fri, May 12 2017 8:48 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

ఈ పెళ్లి కూతురు డ్యాన్స్‌ 15లక్షలమంది చూశారు

ఈ పెళ్లి కూతురు డ్యాన్స్‌ 15లక్షలమంది చూశారు

న్యూయార్క్‌: ఈ మధ్య పెళ్లి కూతుళ్లు డ్యాన్స్‌లు చేస్తుండటం తరుచూ జరుగుతోంది. తమ అభినయాలతో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ భర్తలు సమ్మోహితులయ్యేలా వారు నర్తిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. వారితోపాటు కుటుంబ సభ్యులు కూడా సరదాగా ఆడి పాడుతున్నారు. ఇప్పుడు అచ్చం అలాంటిదే తాజాగా ఫేస్‌బుక్‌లో వైరల్‌ అవుతోంది. న్యూయార్క్‌కు చెందిన పాయల్‌ కడాకియా పుజ్జి అనే వధువు తన వివాహం సందర్భంగా ఏర్పాటుచేసిన రిసెప్షన్‌లో స్లో మోషన్‌ డ్యాన్స్‌తో ఆహ్వానితులను ఆకర్షించింది.

అందరూ ఊపునిచ్చే సాంగ్‌లకు డ్యాన్స్‌లు వేస్తుండగా ఆమె మాత్రం బాలీవుడ్‌లో 1990నాటి హిట్‌ సాంగ్‌ దిల్‌ దివానాకు షారుక్‌చిత్రంలోని రబ్‌ దే బనాడీ జోడీ గీతాలకు డ్యాన్స్‌ చేసి అబ్బురపరిచింది. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 15లక్షలమంది వీక్షించారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా కూడా ఆ నవ వధువును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. నిజంగా ఆమె ఎంత అద్భుతంగా డ్యాన్స్‌ చేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement