వాషింగ్టన్: అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో పాకిస్తాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ గట్టి షాక్ ఇచ్చింది. ఇరాన్‌లోని చాబహార్ పోర్టు అందుబాటులోకి రావడంతో పాకిస్తాన్‌పై వాణిజ్య రవాణా విషయంలో ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయిందని ఆఫ్ఘన్ ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. ఇరాన్‌లోని చాబహార్ పోర్టును వ్యూహాత్మకంగా భారత్, ఇరాన్, ఆఫ్ఘన్ దేశాలు అభివృద్ధి చేసుకోవడంతో.. ఇక పాకిస్తాన్‌తో అవసరమేముందని ఆఫ్ఘన్ అధికారులు స్పష్టం చేశారు. ఇకపై భారత్‌తో జరిపే వాణిజ్యం అంతా చాబహార్ పోర్టునుంచే నిర్వహిస్తామని ఆఫ్ఘన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అబ్దుల్లా అబ్దుల్లా స్పష్టం చేశారు. పాకిస్తాన్ కన్నా నమ్మకమైన ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చాక.. ఇక ఆ దేశం గురించి ఆలోచాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య వాణిజ్య రవాణా అంతా పాకిస్తాన్ మీదే సాగుతోంది. ఈ క్రమంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్‌లు భారీగా పాకిస్తాన్‌కు పన్నులు చెల్లిస్తున్నాయి. చాబహార్ పోర్టు నుంచి రవాణా జరిగితే.. పాకిస్తాన్ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment