క్వీటో: అమెజాన్ తెగకు చెందిన గిరిజనులు కిడ్నాప్ చేసిన ఆరుగురు వ్యక్తులను విడుదల చేసినట్లు ఈక్వెడార్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. కరోనా వైరస్‌తో మృతి చెందిన తమ నాయకుడి మృతదేహాన్ని తమకే ఇవ్వాలనే డిమాండ్‌తో ఆరుగురు వ్యక్తులను గిరిజనులు కిడ్నాప్ చేశారు. ఇద్దరు పోలీసు అధికారులతో పాటు ఇద్దరు సైనికులు, సాధారణ పౌరులను పెరువియన్ సరిహద్దుకు సమీపంలోని కుమయ్ గ్రామ గిరిజన ప్రజలు గురువారం బంధించారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్ నిలిపివేత: డబ్ల్యూహెచ్‌వో)
అయితే ప్రభుత్వానికి, గిరిజన తెగ ప్రజలకు మధ్య జరిగిన చర్చల అనంతరం బంధించిన వారిని గిరిజనులు ఆదివారం విడుదల చేశారని ప్రభుత్వం పేర్కొంది. ‘ఆగ్నేయ ఈక్వెడార్‌లోని అమెజాన్ అడవిలో ఉన్న పాస్తాజా ప్రావిన్స్‌లో గిరిజనుల బంధీ నుంచి విడుదలైన పౌరులకు వైద్య పరీక్షలు నిర్వహించాము’ అని ఈక్వెడార్ అంతర్గత మంత్రి పౌలా రోమో ట్విటర్‌లో తెలిపారు. అదే విధంగా కిడ్నాప్ చేసిన బృందంలో సమారు 600 మంది గిరిజనుల ఉన్నారని పేర్కొన్నారు. (అగ్రరాజ్యంలో కరోనా తాండవం)
ఇక బందీలైన పౌరులను విడిపించేందుకు పోలీసు కమాండర్ జనరల్ ప్యాట్రిసియో కారిల్లో చర్చలు జరిపారని చెప్పారు. ముందుగా గిరిజన నేతకు కారోనా సోకడంతో మరణించాడు. దీంతో ఆరోగ్యశాఖ నిబంధనలు మేరకు ఖననం చేశారు. కానీ గిరిజనులు తమ నేత పార్థివదేహం కోసం ఆరుగురు పౌరులను కిడ్నాప్ చేయడంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. బంధించిన వారిని వదిలిపెట్టిన అనంతరం గిరిజన నేత మృతదేహాన్ని కుమయ్ గ్రామానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment