వాషింగ్టన్: కోవిడ్ –19 రోగులకు వ్యాధి నయం కావాలంటే క్రిమిసంహారక మందులు శరీరంలోకి ఎక్కించడమే మెరుగైన వైద్యమంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేసి, విమర్శలపాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన వ్యాఖ్యలు వ్యంగ్యోక్తులు మాత్రమేనంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కరోనా వైరస్‌ను నాశనం చేయడానికి క్రిమిసంహారక రసాయనాలు రోగుల శరీరంలోకి ఎక్కించాలనీ, అలాగే అతినీలలోహిత కిరణాలను సైతం రోగుల్లోకి చొప్పించాలని వైద్యులకు సూచిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ట్రంప్ సొంత పార్టీనుంచి సైతం తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment