నవమాసాలు మోసే తల్లికి ఏం కోరిక ఉంటుంది? తనకు పుట్టబోయే బిడ్డ ఎప్పుడెప్పుడు భూమ్మీదకొస్తుందా.. ఆ ముద్దులొలికే పాపాయితో ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని ఆలోచిస్తుంటుంది. అయితే ఆ పాపాయిని చూడాలంటే తొమ్మిది నెలల పాటు ఆగాల్సిందేనా? అంతవరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదంటోంది రష్యాకి చెందిన ఓ త్రీడీ కంపెనీ. ఇది పుట్టబోయే పిల్లలను కడుపులో ఉండగానే మన కళ్లకు కట్టేలా చూపిస్తుందట.
సీటీ స్కాన్‌తో చూపిస్తారా అనుకుంటే పొరపాటే. కడుపులోని బుజ్జాయి త్రీడీ ప్రతిబింబాన్ని ముద్రించి మనకు అందజేస్తుందట. దీంతో కడుపులో పాపాయి మన లోగిళ్లలో ఉన్నట్లే ఫీల్ అవ్వొచ్చన్న మాట. ఆ పాపాయిని చూసుకొని మురిసిపోవచ్చు కూడా. అత్యాధునిక అల్ట్రాసౌండ్ టెక్నాలజీని ఉపయోగించి పాపాయి రూపం స్పష్టంగా కనిపించేలా దీన్ని తయారు చేస్తారు. అందులో పాపాయి ముఖం, కాళ్లు, పాదాలు అచ్చు పాపలాగే ఉంటుంది. మరింత అందంగా కనిపించేలా బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో పూత కూడా వేస్తారట. ఈ సాంకేతికతతో ఎంచక్కా మీ పాపాయి పుట్టకముందే త్రీడీ ప్రింటింగ్ ద్వారా మీ పాపాయిని తాకుతున్న అనుభూతిని పొందండి. అమ్మతనాన్ని ఆస్వాదించండి అంటోంది ఆ కంపెనీ.
Comments
Please login to add a commentAdd a comment