9 కోట్ల ‌మోతాదుల వ్యాక్సిన్‌ కొనుగోలు | Britain orders 9 crore doses of coronavirus vaccine | Sakshi
Sakshi News home page

9 కోట్ల ‌మోతాదుల వ్యాక్సిన్‌ కొనుగోలు

Published Mon, Jul 20 2020 5:37 PM | Last Updated on Mon, Jul 20 2020 8:11 PM

 Britain orders 9 crore doses of coronavirus vaccine - Sakshi

లండన్‌: కరోనా విలయం నేపథ్యంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్ ను  భారీ ఎత్తున సొంతం చేసుకునేందుకు బ్రిటన్‌ కీలక ఒప్పందాలను చేసుకుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న రెండు ప్రయోగాత్మక  వ్యాక్సిన్‌ల  9 కోట్ల మోతాదులు కొనుగోలుకు బ్రిటన్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వ్యాపార మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కోవిడ్‌-19 నివారణ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో మూడు రకాల వ్యాక్సిన్లను  ఆర్డర్‌ చేశామని, దీంతో  మొత్తం 230 మిలియన్ మోతాదులను అందుబాటులో ఉండేలా ప్లాన్‌ చేశామని వెల్లడించింది.  (మౌత్‌ స్ర్పేతో నిమిషాల్లో కరోనా ఖతం)

జ‌ర్మ‌నీకి చెందినబ‌యోఎన్‌టెక్, అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్ ఆధ్వర్యంలో రానున్న వ్యాక్సిన్‌  30 మిలియన్ మోతాదులు, 60 మిలియన్ మోతాదుల వాల్నేవా వ్యాక్సిన్‌ కొనుగోలుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకుంది.  అలాగే ఈ వ్యాక్సిన్‌ ఫరీక్షల్లో విజయవంతమైతే మరో  40 మిలియన్ల మోతాదులను కూడా  పొందేలా ఈ  డీల్‌ ఖాయం చేసుకుంది.  ప్రపంచంలోని ప్రముఖ ఔషధ, వ్యాక్సిన్  తయారీ కంపెనీలతో ఈ కొత్త భాగస్వామ్యంద్వారా ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే వ్యాక్సిన్‌ను భద్రపరచడానికి తమకు ఉత్తమమైన అవకాశాన్ని లభించిందని వ్యాపార మంత్రి అలోక్ శర్మ అన్నారు. ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడుతున్న వ్యాక్సిన్ వంద మిలియన్ మోతాదులను కొనుగోలుఒప్పందాన్న  గతంలో ప్రకటించడం గమనార‍్హం.

కాగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. 150కి పైగా వ్యాక్సిన్లు పరీక్షల దశలో ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌  ప్రారంభించిన ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ స్టేజ్‌-1 పరీక్షల ఫలితాలు ఈ రోజు (జూలై 20, సోమవారం) వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఫలితాలను లాన్సెంట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితం కానున్నాయని భావిస్తున్నారు.  అలాగే వ్యాక్సిన్‌ను  ప్రయోగించిన వాలంటీర్ల నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు యూఎస్ బయోటెక్ సంస్థ మోడెర్నా కూడా తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసింది. జూలై 27 న హ్యూమన్‌ ట్రయల్స్‌ చివరి దశను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఈ ట్రయల్స్‌లో 30వేల మంది అమెరికన్లు పాల్గొంటారు. అలాగే మోడెర్నా  టీకా సురక్షితమని  అమెరికా పరిశోధకులు  ఇప్పటికే  నివేదించారు.  ప్రారంభ దశ అధ్యయనంలో మొత్తం 45 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లలో  ఇది విజయవంతమైన ఫలితాలనిచ్చినట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement