లండన్: బ్రిటన్‌తో పాటు పలు దేశాల ప్రయాణికులకు సేవలందించే బ్రిటిష్ ఎయిర్‌వేస్(బీఏ)విమానాలు మూడ్రోజులుగా మూలనపడ్డాయి లండన్‌లోని హీత్రూ, గాట్విక్ విమానాశ్రయాలకు రాకపోకలు నిలిచిపోవడంతో.. వెయ్యి విమానాలు రెక్కలు విచ్చుకోలేదు. సోమవారం పాక్షికంగా రాకపోకల్ని పునరుద్ధరించినా.. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విమానయాన సంస్థ నిర్వహణ సేవల్ని భారత్‌కు ఔట్ సోర్సింగ్‌కు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, అనుభవరాహిత్య ఉద్యోగుల వల్లే బ్యాకప్ కోసం చేసిన యత్నాలు విఫలమయ్యాయని బీఏ ఉద్యోగ సంఘాలు తప్పుపట్టాయి. 2016లో వందల మంది ఐటీ సిబ్బందిని తొలగించి, ఆ ఉద్యోగాలను భారత్‌కు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారన్నాయి. ఆరోపణల్ని బీఏ తోసిపుచ్చింది. ఖర్చుల్ని తగ్గించుకోవడం, లేదా ఐటీ సేవల్ని భారత్‌కు ఔట్ సోర్సింగ్‌కు ఇవ్వడం ఈ సమస్యకు కారణం కాదని పేర్కొంది.