భారత మార్కెట్ను కొల్లగొట్టేందుకు మరోసారి చైనా, జపాన్ పోటీ పడుతున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే బడ్జెట్లో మంత్రి సదానంద గౌడ ప్రకటించడంతో, ఆ మార్కెట్ కోసం ఈ రెండు దేశాలు ఇప్పుడు నేనంటే నేనంటూ ముందుకొస్తున్నాయి. అహ్మదాబాద్-ముంబై మార్గంలో ఇప్పటికే హైస్పీడ్ రైళ్లను నడిపించడానికి వీలుందా లేదా అనే విషయంలో జపాన్ కంపెనీ ఇప్పటికే కొన్ని పరీక్షలు చేసింది. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనకు వెళ్లనుండటంతో.. అప్పుడే ఈ పరీక్షల ఫలితాలపై అక్కడ చర్చ జరగనుంది.
షిన్కన్సెన్ కంపెనీకి చెందిన హైస్పీడ్ రైళ్లను కొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని జపాన్ ప్రధాని షింజో అబె గట్టిగా కోరుతారని భావిస్తున్నారు. క్యోటో నుంచి టోక్యోకు ఇదే కంపెనీ హైస్పీడ్ రైళ్లను నడిపిస్తోంది. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద హైస్పీడ్ రైల్ నెట్వర్క్ చైనాలో ఉంది. తాము జపాన్ కంటే తక్కువ ధరకే రైళ్లు అమ్ముతామని చైనా అంటోంది. సెప్టెంబర్ రెండోవారం తర్వాత చైనా అధ్యక్షుడు సి జిన్పింగ్ భారతదేశంలో తొలిసారి పర్యటించనున్నారు. ఒకవైపు జపాన్ తాము మంచి నాణ్యమైన రైళ్లు, ఉన్నత భద్రతా ప్రమాణాలు అందిస్తామని చెబుతుంటే, చైనా మాత్రం తక్కువ ధరకు ఇస్తామని అంటోంది.
మా రైళ్లు అమ్ముతాం.. తీసుకోరూ!!
Published Tue, Aug 26 2014 1:52 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement