బీజింగ్: మహమ్మారి కరోనా వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే క్రమంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. ఇప్పటికే దేశీయ విమాన ప్రయాణాలకు అనుమతినిచ్చిన డ్రాగన్ దేశం.. సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కో నుంచి బీజింగ్‌కు వచ్చేందుకు ప్రయాణికులను అనుమతించింది. అయితే చైనా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించేవారు విధిగా న్యూక్లిక్ యాసిడ్ టెస్టు(ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ) ఫలితాల వివరాలు తమకు సమర్పించాలని పేర్కొంది. సదరు పరీక్షలో నెగటివ్ ఫలితాలు వచ్చిన వారే తమ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించేందుకు అర్హులని షరతు విధించింది. మే 8 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని... ప్రయాణానికి 120 గంటల ముందు టెస్టు వివరాలు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా రష్యాలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఒక్కరోజే అక్కడ దాదాపు 10 వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో సగం కేసులు రాజధాని మాస్కోకు చెందినవే. (కరోనా వ్యాక్సిన్.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు)
ఇక మాస్కో నుంచి వచ్చే ప్రయాణికులకు షరతు విధించిన చైనా ఎయిర్‌లైన్స్... రాజధాని బీజింగ్ సహా ఇతర ప్రధాన పట్టణాలకు వచ్చే విమాన ప్రయాణికులు తప్పనిసరిగా న్యూక్లిక్ యాసిడ్ టెస్టు చేయించుకోవాలని పేర్కొంది. ఆ తర్వాత సెంట్రలైజ్‌డ్ క్వారంటైన్‌కు వెళ్లాలని, అనంతరం ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది. ప్రయాణం తర్వాత కేవలం ఒకే ఒక వ్యక్తిని మాత్రమే నేరుగా కలిసేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు చైనా ఎయిర్‌లైన్స్ అధికారిక సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా లాక్‌డౌన్ ఎత్తివేసిన క్రమంలో కేవలం మూడు రోజుల్లోనే.. 85 మిలియన్ మంది పర్యాటకుల ద్వారా చైనా దాదాపు 35.06 బిలియన్ యువాన్ల ఆదాయం గడించింది.(నివురు గప్పిన నిప్పులా వుహాన్)
China saw nearly 85 million domestic tourist trips in the first three days of its five-day #MayDayHoliday, with the tourism revenue reaching 35.06 billion yuan (4.97 billion U.S. dollars) from May 1 to May 3, according to the Ministry of Culture and Tourism on Sunday. pic.twitter.com/gnNXsbU2SC
— People's Daily, China (@PDChina) May 4, 2020
Comments
Please login to add a commentAdd a comment