
బీజింగ్: తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అమెరికా ప్రపంచ ఆరోగ్యసంస్థ మీద, చైనా మీద ఆరోపణలు చేస్తోందని మంగళవారం చైనా పేర్కొంది. చైనా విదేశాంగమంత్రిత్వ శాఖ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్యసంస్థకు విరాళాలు ఇవ్వడం అనేది ప్రతి ఒక్క సభ్యదేశం బాధ్యత అన్నారు. 30 రోజుల్లో కరోనా నియంత్రణకి సంబంధించి ఎలాంటి అభివృధ్ది కనబరచకపోతే ప్రపంచ ఆరోగ్యసంస్థకి పూర్తిగా నిధులు నిలుపుదల చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (‘డబ్ల్యూహెచ్ఓకి నిధులు పూర్తిగా నిలిపివేస్తాం’)
కరోనాకు వైరస్ వ్యాప్తికి సంబంధించి చైనా ఒత్తిడి కారణంగా సరైనా సమాచారం ఇవ్వకుండా తప్పుడు సమాచారం ఇచ్చి డబ్ల్యూహెచ్‌వో ప్రపంచదేశాలల్లో వైరస్ విస్తరించడానికి కారణమయ్యిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. చైనాకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న కారణంతో ఏప్రిల్ నెలలో ట్రంప్ డబ్ల్యూహెచ్‌ఓకి నిధులు ఆపేశాడు. ట్రంప్‌తో పాటు చాలా మంది అమెరికా అధికారులు కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో పుట్టిందని ఆరోపించారు. అయితే దీన్ని చైనాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఖండించింది. (వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడి.. ప్రయోగం సక్సెస్!)
Comments
Please login to add a commentAdd a comment