వాషింగ్టన్ : యుద్ధ నేరాల ఆరోపణలపై జైలు పాలైన బోస్నియాకు చెందిన మాజీ క్రోట్ లీడర్ ఐక్యరాజ్యసమితి న్యాయస్థానంలో విషం తాగి బలవన్మరణం చెందారు. యుద్ధ నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్(ఐసీటీ) తీర్పునిస్తూ, స్లోబోడన్ ప్రల్‌జక్(72)కు 20 ఏళ్ల కారాగార శిక్షను విధించింది. దీంతో షాక్‌కు గురైన స్లోబోడన్ తాను నేరస్తుడిని కాదంటూ కోర్టు హాలులో పెద్దగా కేకలు వేశాడు.
తనతో పాటు తెచ్చుకున్న విషాన్ని తాగేశాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్లోబోడన్ ప్రాణాలు విడిచాడు. స్లోబోడన్‌తో పాటు మరికొందరిపై కూడా బోస్నియా - హెర్జ్‌గోవినాల మధ్య 1990లో వచ్చిన యుద్ధంలో ఘాతుకాలకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయి.
ఈ రణంలో దాదాపు ఒక లక్ష మంది ప్రజలు ప్రాణాలు విడిచారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా 1995లో ఓ శాంతి ఒప్పందాన్ని కుదిర్చింది. అనంతరం యుద్ధ నేరాలు చేసిన వారిని అంతర్జాతీయ నేరస్తులుగా పరిగణిస్తూ అరెస్టులు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment