సియోల్ : కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ హ్యుందాయ్ మోటార్‌పై పడింది. హ్యూందాయ్ ప్లాంట్‌లో పనిచేసే కార్మికులకు వైరస్ సోకినట్లు నిర్థారణ కావడంతో దక్షిణ కొరియాలోని ఉల్సాన్ ప్లాంట్‌ను యాజమాన్యం మూసివేసింది. కరోనా లక్షణాలతో ఓ ఉద్యోగిని గుర్తించిన యాజమాన్యం.. వెంటనే అతనికి వైద్య పరీక్షలు చేయగా.. వైరస్ నిర్థారణ అయింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా సహా ఉద్యోగులకు వైరస్ సోకకుండా ప్లాంట్‌ను మూసివేసి.. అతన్ని వైద్యల పర్యవేక్షణకు తరలించారు. కాగా ప్రమాదకార వైరస్ ప్రభావం కారణంగా కంపెనీ షేర్లు ఇప్పటికే 5శాతం కుంగిపోయాయని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. (కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం)
కాగా ఉల్సాన్‌లోని ప్లాంట్‌లో దాదాపు 34వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఇదే కావడం గమనార్హం. కరోనా విజృంభణ కారణంగా చైనా తరువాత అత్యధికంగా ప్రభావితమైన రెండో దేశం దక్షిణ కొరియా. దీంతో ప్రపంచంలో అతిపెద్ద సంస్థలైన శాంసంగ్, హ్యూందాయ్ పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొరియాలో ఇప్పటికే 2,022 కరోనా కేసులు నమోదు కాగా.. ఒక్క శుక్రవారం నాడే ఏకంగా 256 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment