న్యూఢిల్లీ : వచ్చేవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం చైనాలో పర్యటించనుంది. కరోనా వైరస్ వ్యాప్తి మూలాన్ని పరిశోధించడానికి తమ బృందం చైనాకు వెళ్లనుందని చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని చైనాకు డబ్ల్యూహెచ్ఓ బృందాన్ని పంపి దర్యాప్తు జరపాలన్న అమెరికా విమర్శల్లో భాగంగా డబ్ల్యూహెచ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంరద్భంగా టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోందని ఆయన అన్నారు. వైరస్ ఎక్కడి నుంచి వ్యాప్తి చెందిందో తెలుసుకోవడం చాలా చాలా కీలకమనీ... అది ఎలా మొదలైందో తెలిస్తేనే వైరస్‌తో పోరాడగలమని పేర్కొన్నారు. ఇందుకోసం వచ్చేవారంలో చైనా వెళ్లేలా ఓ బృందాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. (చైనాను కలవరపెడుతోన్న మరో వైరస్)
Comments
Please login to add a commentAdd a comment