శ్రీలంక క్రికెట్ టీంపై 2009లో జరిగిన దాడిలో పాల్గొన్న వారిగా అనుమానిస్తున్న లష్కర్-ఈ-జాంగ్వీ(ఎల్‌ఈజే) ఉగ్రవాదులు
లాహోర్: శ్రీలంక క్రికెట్ టీంపై 2009లో జరిగిన దాడిలో పాల్గొన్న వారిగా అనుమానిస్తున్న లష్కర్-ఈ-జాంగ్వీ(ఎల్‌ఈజే) ఉగ్రవాదులు నలుగురు ఆదివారం పాకిస్తాన్ పోలీసుల చేతిలో హతమయ్యారు. లాహోర్‌లోని మన్వాన్ ప్రాంతంలో సీఐడీ బృందంపై ఆదివారం ఏడుగురు తీవ్రవాదులు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన వారు ఎదురు కాల్పులు జరపగా నలుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు.