వాడి పారేసే ‘కాఫీ మెషీన్’! | Disposable Coffee Machine: 'Grower's Cup' System Is Neat, And Cheap | Sakshi
Sakshi News home page

వాడి పారేసే ‘కాఫీ మెషీన్’!

Published Thu, May 8 2014 1:25 AM | Last Updated on Sat, Aug 11 2018 4:36 PM

వాడి పారేసే ‘కాఫీ మెషీన్’! - Sakshi

వాడి పారేసే ‘కాఫీ మెషీన్’!

వేడి వేడి పాలలో వేసి అప్పటికప్పుడు తేలికగా చాయ్ తయారు చేసుకునేందుకు టీ పొడి బ్యాగులు ఉన్నాయి. మరి కాఫీ పొడి బ్యాగులను ఎక్కడైనా చూశారా? అలాంటివి లేవు కదూ. అందుకే మరి.. ఉల్‌రిక్ రాస్‌మ్యూసెన్ అనే డానిష్ డిజైనర్ ప్రపంచంలోనే తొలిసారిగా ఈ డిస్పోజబుల్ ‘కాఫీ మెషీన్’ను తయారు చేశారు. ‘గ్రోవర్స్ కప్’ అని పేరుపెట్టిన ఈ బ్యాగులో ఒక అరలో కాఫీ పొడి ఉంటుంది. దీన్లోకి నీళ్లు పోస్తే చాలు.. కాఫీ నీళ్లు ఫిల్టర్ అయి కింది అరలోకి చేరుతాయి. వాటిని పాలలో ఒంపుకుంటే సరి.. కాఫీ రెడీ! కాఫీ అంటే తెగ ఇష్టపడే ఉల్‌రిక్.. ఓసారి కాఫీ మెషీన్‌లో ఫిల్టర్లు పనిచేయకపోవడంతో బాగా ఆలోచించి ఈ గ్రోవర్స్ కప్‌ను డిజైన్ చేశాడు. సుమారు 300 మి.లీ. నీరు పట్టే ఈ బ్యాగు ద్వారా రెండు కప్పుల కాఫీ తయారు చేసుకోవచ్చు. ధరెంతో చెప్పలేదు కదూ.. జస్ట్ 102 రూపాయలు మాత్రమే!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement