
లండన్: బ్రెగ్జిట్ వివాదం నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని ఆ దేశ సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రెగ్జిట్ అంశంపై కొంత కాలంగా బ్రిటన్ పార్లమెంటులో వాడి, వేడి రాజకీయాలు నడుస్తుండగా, ఈ నెల మొదట్లో పార్లమెంటును 5 వారాలపాటు సస్పెండ్ చేస్తూ బోరిస్ నిర్ణయం తీసుకున్నారు.
భారతీయ సంతతి మహిళ గినా మిల్లర్ ఈ అంశంపై యూకే హైకోర్టును ఆశ్రయించగా కేసును సుప్రీంకోర్టుకు హైకోర్టు బదిలీ చేసింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ లేడీ బ్రెండా హేల్ మాట్లాడుతూ పార్లమెంటు రద్దు నిర్ణయం ప్రజాస్వామ్య మూలాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. బోరిస్ జాన్సన్ నిర్ణయం చట్ట విరుద్ధం కాబట్టి అది చెల్లదని, పార్లమెంటు నడపడంపై కామన్స్, లార్డ్స్ సభాపతులు ఒక నిర్ణయం తీసుకోవచ్చునని వివరించారు. కోర్టు తీర్పుపై వ్యాఖ్యానించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment