మానవ సంకల్పానికి టెక్నాలజీ ఊతం
ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు క్లెయిర్ లోమస్. మొక్కవోని సంకల్పానికి నిదర్శనం ఈమె అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే.. గుర్రపు స్వారీ ప్రమాదం కారణంగా పక్షవాతం బారినపడి కాళ్లు చచ్చుబడిపోయినా... ప్రస్తు తం 4నెలల గర్భంతో ఉన్నా, టెక్నాలజీ సాయంతో ఇటీవలే ఓ మారథాన్ పోటీని దిగ్విజయంగా ముగించింది కాబట్టి! లీచెస్టర్‌షైర్‌కు చెంది న క్లెయిర్ 21 కి.మీ దూరా న్ని పూర్తి చేసేందుకు 5 రోజు ల సమయం తీసుకున్నా.. కృత్రిమ అవయవాలతో ఒక మారథాన్‌ను పూర్తి చేయడం ఆషామాషీ కాదు. ప్రస్తుతం ఈమె వయసు 36 ఏళ్లు. తొమ్మిదేళ్ల క్రితం గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదం జరిగి మెడ, ఛాతీ ఎముకలు విరిగిపోయాయి.
ఊపిరితిత్తులకు కన్నం కూడా పడింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రీవాక్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఎక్సోస్కెలిటన్ ఆమె మళ్లీ నడిచేందుకు తోడ్పడింది. పాదాలు, నడుము, పై భాగాల్లో మోషన్ సెన్సర్స్ కలిగిన ఈ ఎక్సో స్కెలిటన్ కాళ్లను కదిపేందుకు సహకరిస్తుంది. క్లెయిర్ ఎక్సోస్కెలిటన్‌తోపాటు క్రచెస్ కూడా వాడి మారథాన్‌ను పూర్తి చేసింది.