ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసిన వ్యక్తికి పాజిటివ్‌ | Doctors Collected Pakistan PM Imran Khan Samples Amid Covid 19 | Sakshi
Sakshi News home page

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు కరోనా పరీక్షలు

Published Wed, Apr 22 2020 12:28 PM | Last Updated on Wed, Apr 22 2020 12:34 PM

Doctors Collected Pakistan PM Imran Khan Samples Amid Covid 19 - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్యులు కరోనా(కోవిడ్‌-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ఎది ఫౌండేషన్‌ చైర్మన్‌  ఫైజస్‌ ఎది ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసి విరాళాన్ని అందజేశారు. ఈ క్రమంలో ఫైజల్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఫైజల్‌ కరోనా బారిన పడటంతో అప్రమత్తమైన షౌకత్‌ ఖానం మెమోరియల్‌ ఆస్పత్రి వైద్యులు ప్రధానిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. (మసీదుల్లో రంజాన్‌ ప్రార్థనలకు పాక్‌ అనుమతి)

ఇక ఇమ్రాన్‌ ఖాన్‌ ఇందుకు అంగీకరించడంతో ఆయన శాంపిల్స్‌ను సేకరించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి ఆస్పత్రి సీఈఓ మాట్లాడుతూ.. తమ సూచన మేరకు ప్రధాన మంత్రి కరోనా పరీక్షలు చేయించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నెగటివ్‌ ఫలితమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా పాకిస్తాన్‌లో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 705 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 9214కు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మసీదుల్లో రంజాన్‌ ప్రార్థనలకు ఇమ్రాన్‌ సర్కారు అనుమతినివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.(ఉ‍గ్ర జాబితాలో ఆ పేర్లు మాయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement