
వాషింగ్టన్: అమెరికాలో డాక్టరు చీటిపై దొరికే మందుల ధరలు దిగొచ్చేలా కొత్త పాలసీని తీసుకొస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. డ్రగ్ కంపెనీలు తమ మందుల్ని ఇతర దేశాల్లో తక్కువకు అమ్ముతూ అమెరికాలో మాత్రం ఎక్కువ వసూలు చేస్తున్నాయని ఆయన తప్పుపట్టారు.
అమెరికా ఇస్తున్న సబ్సిడీలతో కంపెనీలు విదేశాల్లో తక్కువ ధరలకు మందుల్ని అమ్ముతున్నాయని, ఇక నుంచి అలా జరగనివ్వమని ఆయన పేర్కొన్నారు. ఒక వేళ ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే భారత్ వంటి దేశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.వైట్ హౌస్‌లో కేబినెట్ సహాచరులతో ట్రంప్ మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో అమ్మే మందుల ధరల్ని అమెరికా ప్రభుత్వం కాకుండా కంపెనీలు నిర్ణయిస్తున్నాయని, ఈ విధానం మారాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment