
క్యాంప్‌డేవిడ్ : ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఫోన్‌లో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య చర్చలు సానుకూల ఫలితాలు రాబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఈ చర్చలతో తెరపడుతుందని అన్నారు.
వచ్చే వారం దక్షిణ కొరియాతో అధికారిక సంప్రదింపులకు ఉత్తర కొరియా అంగీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్, కిమ్‌ల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో చర్చల ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. తన టేబుల్ వద్దే న్యూక్లియర్ బటన్ ఉందని గతవారం ట్రంప్‌ను ఉద్దేశించి కిమ్ హెచ్చరించగా..తన వద్ద పెద్ద బటన్ ఉందని, అది కచ్చితంగా పనిచేస్తుంది కూడా అంటూ ట్రంప్ దీటుగా కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment