ఆ జ్యూస్లు ఎక్కువ తాగితే చర్మక్యాన్సర్!
న్యూయార్క్: సిట్రస్ ఎక్కువగా ఉండే ద్రాక్ష, ఆరెంజ్ పళ్ల రసాలు ఎక్కువగా తాగడం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అని అమెరికాకు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. దాదాపు లక్షమంది అమెరికన్లలో 36శాతం మందికి మెల్నిన్ సమస్యలు ఉన్నట్లు గుర్తించామని, ఇదే క్యాన్సర్గా మారుతున్నట్లు గుర్తించామని తెలిపింది. రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన వారెన్ అల్పర్ట్ మెడికల్ స్కూల్ డెర్మటాలజిస్ట్ షావోయి వూ దీనికి సంబంధించిన వివరాలను అమెరికాలోని ఓ జర్నల్ కు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం రోజుకు కనీసం రెండు ఆరెంజ్ లేదా ద్రాక్ష రసాలు తాగే వారికంటే కనీసం ఒకటి నుంచి ఆరు జ్యూస్లు తాగే వారికి చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
చర్మ క్యాన్సర్ ను కలిగించేందుకు ఎక్కువ కారకమయ్యే ప్యూరోకోమరిన్స్ అనే కారకం సిట్రస్లో ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైనట్లు చెప్పారు. దీనికి చర్మంలో ఉండే మెలనిన్కు ఒక ప్రత్యేకమైన సబంధం ఉన్నట్లు స్పష్టమైందని వారు తెలిపారు. వారి అధ్యయనం కోసం ఇదే అంశంపై 1984 నుంచి 2010 మధ్య కాలంలో 63,810 మంది మహిళలపై చేసిన పరిశోధనను, 1984 నుంచి 2010 మధ్య కాలంలో పురుషులపై వచ్చిన పరిశోధనలు కూడా పరిగణనలోకి తీసుకున్నారు.