మెక్సికో దక్షిణ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది.
హైదరాబాద్: మెక్సికో దక్షిణ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదైంది. సోమవారం ఉదయం మెక్సికోలోని చియపస్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది.
పసిఫిక్ మహాసముద్రం తీరం సమీపంలో 92 కిలో మీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు. సునామీ ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు.