ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ వచ్చేసింది...
విద్యుత్‌తో నడిచే వాహనాలను మనం చూసుంటాం. కానీ, ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్. 30 కిలోవాట్ల సామర్థ్యముండే రెండు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఇంజన్లతో పనిచేసే ఈ బుల్లి విమానం గంటకు 177 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.‘ఈ-ఫ్యాన్’గా పిలవబడే ఈ కొత్త విమానాన్ని ప్రఖ్యాత విమానతయారీ సంస్థ ఎయిర్‌బస్ రూపొందించింది.
దక్షిణ ఫ్రాన్స్‌లోని బోర్డాక్స్ నగరంలోని విమానాశ్రయం లో శుక్రవారం తొలిసారిగా విజయవంతంగా పరీక్షిం చారు. త్వరలో రెండు సీట్లు ఉండే విమానాలను తయారుచేసి వైమానిక శిక్షణ సంస్థలకు విక్రయించాలని కంపెనీ భావిస్తోంది.