'ఫేస్‌బుక్ నన్ను ఉగ్రవాదిగా చూస్తోంది'
న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాద గ్రూపు సంక్షిప్త నామం ఐఎస్ఐఎస్. దీనిని కలిపి చదివితే ఐసీస్ అవుతుంది. ఇదే పేరును కలిగి ఉండటంతో ఓ మహిళా స్టాఫ్‌వేర్ డెవలపర్‌కు ఫేస్‌బుక్ నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ఆమె ఖాతాను ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఖాతాగా భావిస్తూ ఫేస్‌బుక్ బ్లాక్ చేసింది. దీనిపై శాన్‌ఫ్రాన్సికోకు చెందిన ఐసీస్ యాంచలీ అహసనం వ్యక్తం చేసింది.
ఫేస్‌బుక్ లాగిన్ పేజీలో 'అకౌంట్ డిజెబుల్డ్' అని వచ్చిన సందేశాన్ని ప్రింట్‌స్ర్కీన్ తీసి.. ఆమె ట్విట్టర్‌లోని ఫేస్‌బుక్ పేజీలో పెట్టి.. ' మీరు నా పర్సనల్ అకౌంట్‌ను ఎందుకు తొలగించారు. నా అసలు పేరు ఐసీస్ యాంచలీ' అని పేర్కొంది. 'ఫేస్‌బుక్ నన్ను ఉగ్రవాదిగా చూస్తోంది. మళ్లీ అకౌంట్‌ను తెరిపించడానికి వాళ్లకు నా పాస్‌పోర్టు స్క్రీన్‌షాట్ తీసి పంపించడం సరికాదనుకుంటా' అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది. ఆమె ట్విట్టర్‌లో పెట్టిన వ్యాఖ్యకు ఫేస్‌బుక్ సిబ్బంది ఒకరు సమాధానమిచ్చి.. ఆమె అకౌంట్‌ను మళ్లీ యాక్టివేట్ చేశారు.
పొరపాటును ఆమె అకౌంట్ బ్లాక్ చేసినందుకు ఫేస్‌బుక్ క్షమాపణలు చెప్పింది. నకిలీ అకౌంట్లను తొలగించే చర్యలో భాగంగా పొరపాటును ఈ ఘటన జరిగిందని, పొరపాటు తెలిసిన వెంటనే ఆమె ఖాతాను పునరుద్ధరించామని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి తెలిపారు.
Facebook thinks I'm a terrorist. Apparently sending them a screenshot of my passport is not good enough for them to reopen my account.
— Isis Anchalee (@isisAnchalee) November 17, 2015