అబుజా: ఆత్మాహుతి దాడులతో నైజీరియా మరోసారి దద్ధరిల్లింది. నార్త్-ఈస్ట్ నైజీరియాలో ఉన్న దిక్వా పట్టణంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 60 మందికి పైగా మృత్యువాతపడగా, సుమారు 80 మంది గాయపడ్డారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ బొకో హరామ్ గ్రూపు సభ్యులైన ఇద్దరు యువతులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు మిలిటరీ అధికారులు భావిస్తున్నారు. దాడి జరగడంతో టెలిఫోన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఐడీపీ క్యాంపులోకి వెళ్లిన తర్వాత ఆ మహిళలు ఆత్మాహుడి దాడికి పాల్పడ్డారని ఆర్మీ అధికారులు వివరించారు.
ఈ దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రసంస్థలు ప్రకటించలేదని ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ చైర్మన్ సటోమీ అహ్మద్ తెలిపారు. సాధారణంగా బొకో హరామ్ ఉగ్రసంస్థ మహిళలు, చిన్నారుల్ని తమ మార్గంగా చేసుకుని ఈ తరహా పాల్పడుతారని పేర్కొన్నాడు. జవనరి 31న బోర్నె స్టేట్ రాజధాని మైదుగరిలో జరిగిన దాడిలో 65 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఐడీపీ క్యాంపుపై జరిగిన రెండో దాడి ఇది. బొకో హరామ్ గ్రూపు తొలి దాడి గత సెప్టెంబర్ లో చేసింది.
ఆత్మాహుతి దాడి... 60 మందికి పైగా మృతి
Published Thu, Feb 11 2016 11:49 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM
Advertisement