బుల్లెట్ ట్రైన్ను నిలిపివేసి సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యం
టోక్యో: జపాన్ రాజధాని నగరం టోక్యో నుంచి ఒకాసాకు వెళుతోన్న బుల్లెట్ ట్రైన్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంట తెచ్చుకున్న నూనెను ఒంటిపై పోసుకుని సిగరెట్ లైటర్ తో వెలిగించుకున్నాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి సహా మరో మహిళ కూడా మృతి చెందింది.
రైలు మొత్తం దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. దీంతో పలువురు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిసింది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే అధికారులు రైలును నిలిపివేయడంతో మరిన్ని ప్రాణాలను కాపాడగలిగారు. 50 ఏళ్ల జపాన్ బుల్లెట్ రైలు చరిత్రలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.