లాహోర్: నిర్బంధంలో ఉన్న ముంబై దాడుల సూత్రధారి, జమాత్–ఉద్–దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్‌కు భద్రత పెంచాలని అక్కడి పంజాబ్ హోం మంత్రత్వ శాఖను పాకిస్తాన్ ప్రభుత్వం కోరింది. ఆయన్ని హతమార్చేందుకు ఓ విదేశీ నిఘా సంస్థ కుట్ర పన్నిందని ఆరోపించింది.
పాకిస్తాన్ జాతీయ ఉగ్రవ్యతిరేక ఏజెన్సీ రాసిన లేఖలో...హఫీజ్‌ను అంతమొందించేందుకు విదేశీ నిఘా సంస్థ ఓ నిషేధిత సంస్థకు చెందిన ఇద్దరికి రూ.8 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. హఫీజ్‌కు కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని పంజాబ్ హోంమంత్రిత్వ శాఖను కోరింది. ఉగ్ర వ్యతిరేక చట్టం కింద ఈ ఏడాది జనవరి 30 నుంచి లాహోర్‌లో గృహ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. జేయూడీ ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా హఫీజ్ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment