కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు హోస్నీ ముబారక్(86)కు భారీ ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఇక్కడి క్రిమినల్ కోర్టు బుధవారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన ఇద్దరు తనయులు అలా, గమాల్‌ను కూడా దోషులుగా తేల్చి నాలుగేళ్ల జైలుశిక్ష వేసింది. అధ్యక్ష భవన నవీకరణకు ఉద్దేశించిన 1.79 కోట్ల డాలర్లను వీరు కాజేశారని నిర్ధారించిన కోర్టు 1.76 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. 29 లక్షల డాలర్లను ప్రభుత్వ ఖజనాకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.