ఇస్లామాబాద్: పాకిస్థాన్ నౌకాశ్రయ నగరం కరాచీలో పోలీసులు, తీవ్రవాదులకు మధ్య మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. దీనిలో నలుగురు తీవ్రవాదులు మరణించారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించింది. నగరంలోని సఫోరా చౌక్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నాయి... ఆ క్రమంలో రెండు బైక్‌లపై వెళ్తున్న నలుగురు యువకులను ప్రశ్నించగా... వారు తమ వద్ద ఉన్న తుపాకీలతో పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ మేరకు బుధవారం మీడియా వెల్లడించింది.
పాక్‌లో నలుగురు తీవ్రవాదుల హతం
Published Wed, Jun 17 2015 11:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement