వాషింగ్టన్: విదేశీ నిపుణులకు జారీచేస్తున్న హెచ్1బీ వీసా విధానంలో ఎలాంటి మార్పు చేయలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగంలోని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికన్లు ఉద్యోగాలు నష్టపోకుండా, వేతనాలు తగ్గకుండా ఉండేలా ఈ విధానాన్ని ప్రస్తుతం సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 6న ఢిల్లీలో జరగనున్న భారత్–అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల 2+2 సమావేశంలో హెచ్1బీ వీసా అంశాన్ని భారత్ లేవనెత్తే అవకాశముందని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలను నిరాకరిస్తూ హెచ్1బీ వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయన్న అంశంపై ప్రస్తుతం సమీక్ష కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ విషయమై విచారణ జరిపేందుకు వీలుగా ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులను గతంలో జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment