కొత్త చోట సగం మెలకువలోనే
వాషింగ్టన్: కొత్త ప్రాంతంలో నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి కారణాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు మెదడులో సగభాగం మేల్కొని ఉంటుందని, ఏదైనా సమస్య తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందని తెలుసుకున్నామని అమెరికాలోని బ్రౌన్ వర్సిటీకి చెందిన యుకా ససాకి తెలిపారు. 35 మంది వలంటీర్లపై చేసిన అధ్యయనంతో ఈ విషయం తేలిందన్నారు.
మెదడులోని కుడి భాగం కంటే ఎడమ భాగం చాలా క్రియాశీలంగా ఉంటుందని గుర్తించారు. అధ్యయనానికి ఎలక్ట్రో ఎన్సిఫెలోగ్రఫీ, మాగ్నెటో ఎన్సిఫెలోగ్రఫీ తదితరాలను శాస్త్రవేత్తలు వినియోగించారు. ఈ అధ్యయనాన్ని కరెంట్ బయాలజీ అనే జర్నల్‌లో ప్రచురించారు.