
ఆవులతో హెచ్‌ఐవీ వ్యాక్సిన్?
అయితే ఈ వ్యాధి మిగిలిన జంతువులకు సోకినా.. ఆవులకు మాత్రం సోకదు. దీనికి కారణమేమిటో తెలుసుకునేందుకు స్క్రిప్స్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం చేశారు. హెచ్‌ఐవీ వైరస్ ఉపరితలాన్ని పోలిన ప్రొటీన్‌ను ఆవుల్లోకి ఎక్కించారు. ఆ తర్వాత ఏడాది పాటు అప్పుడప్పుడూ ఆవుల రక్తం సేకరించి యాంటీబాడీలను వేరు చేశారు. ఈ యాంటీబాడీలు కణాల్లోకి హెచ్‌ఐవీ వైరస్ చేరకుండా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఈ యాంటీబాడీలు అనేక ఇతర వైరస్‌లను కూడా నిరోధిస్తున్నట్లు తెలిసింది.
ఆవుల జీర్ణవ్యవస్థ ప్రత్యేక నిర్మాణం.. నిత్యం అనేక రకాల సూక్ష్మజీవులతో దాని రోగ నిరోధక వ్యవస్థ పోరాడుతూ ఉండటం వంటి కారణాల వల్ల ఈ క్షీరదాలు ఉత్పత్తి చేసే యాంటీబాడీలు చాలా పొడవుగా ఉంటాయని.. అందువల్లే ఇవి హెచ్‌ఐవీని అడ్డుకోగలుగుతున్నాయని ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్‌కు చెందిన శాస్త్రవేత్త డెవిన్ సోక్ చెబుతున్నారు. ఆవులకు ఉన్న ఈ వినూత్న లక్షణం ఆధారంగా భవిష్యత్తులో హెచ్‌ఐవీకి మాత్రమే కాకుండా.. అనేక ఇతర వైరస్ సంబంధిత వ్యాధులకూ మెరుగైన చికిత్స లభించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.