కంటైనర్లు పేర్చి.. హోటల్‌గా మార్చి... | Hotel can make using of ship containers | Sakshi
Sakshi News home page

కంటైనర్లు పేర్చి.. హోటల్‌గా మార్చి...

Published Thu, Apr 24 2014 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM

కంటైనర్లు పేర్చి.. హోటల్‌గా మార్చి...

కంటైనర్లు పేర్చి.. హోటల్‌గా మార్చి...

బ్లాక్స్‌ను ఒకదాని మీద ఒకటి పేర్చి ఆడే గేమ్‌లాగా కనిపిస్తున్నా.. ఇది ఓ హోటల్ డిజైన్. రీసైకిల్ చేసిన షిప్ కంటైనర్లతో దీన్ని కడతారు. ఈ హోటల్ పేరు హైవ్-ఇన్. హాంకాంగ్‌కు చెందిన వోవీఏ స్టూడియో దీని రూపకర్త. ఈ విధంగా హోటల్ కడితే.. అటు యాడ్‌లకూ కొరత ఉండదని చెబుతున్నారు. ఒక్కో కంటైనర్ మీద ఒక్కో కంపెనీ తమ యాడ్‌ను ఇచ్చుకోవచ్చని.. తద్వారా హోటల్‌కు బోలెడెంత ఆదాయమని చెబుతున్నారు. అయితే, కంటైనర్ మీద ఏ కంపెనీ యాడ్ ఉంటే.. అందులోని ఇంటీరియర్ కూడా దాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఉదాహరణకు ఫెరారీ కంపెనీ యాడ్ ఉంటే.. అందులో ఫెరారీ ఫార్ములావన్ డ్రైవర్ల ఫొటోలు.. సోఫాలు వంటివి కారు డిజైన్‌లో ఏర్పాటు చేయడం వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ వినూత్న హోటల్‌ను నిర్మించేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement