భారీ తుఫాను.. 400 విమానాలు రద్దు!
భారీ తుఫాను.. 400 విమానాలు రద్దు!
Published Mon, Aug 22 2016 9:36 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోను భారీ టైపూన్(తుఫాను) 'మిండుల్లే' వణికిస్తోంది. భారీ ఈదురుగాలులతో తుఫాను సోమవారం టోక్యోను తాకుతుందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. టోక్యో నుంచి ఉత్తర తొహుకు ప్రాంతం దిశగా మిండుల్లే ప్రభావం చూపుతుందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను సందర్భంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
టోక్యో నగరంపై మిండుల్లే తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఇక్కడ వరదలు, ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా అధికారులు సుమారు 400 విమానాలను రద్దు చేశారు. ముఖ్యంగా టోక్యోలోని హనెడ విమానాశ్రయంకు రాకపోకలు నిలిచిపోయాయి. 145 దేశీయ విమానాలను రద్దు చేసినట్లు జపాన్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ సైతం 90 విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో.. సుమారు 48 వేల మంది విమాన ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతున్నట్లు వెల్లడించారు.
Advertisement
Advertisement