బీజింగ్: టైప్ 1 మధుమేహం బాధితులకు మిగతా వారితో పోలిస్తే మూర్ఛ వచ్చే అవకాశం మూడు రెట్లు అధికమని తాజా పరిశోధనలో వెల్లడైంది. తెవాన్ లోని చైనా మెడికల్ యూనివర్సిటీ పిల్లల ఆస్పత్రి పరిశోధకులు టైప్ 1 డయాబెటీస్, మూర్ఛకు మధ్య సంబంధంపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు. 2,568 మంది వ్యాధి బాధితులపై పరిశోధన నిర్వహించి, టైప్ 1 బాధితులు మిగతా వారి కన్నా ఎక్కువగా మూర్ఛ బారిన పడుతున్నారని గుర్తించారు. 2.84 రెట్లు అధికంగా మూర్ఛ వచ్చే అవకాశముందని కనుగొన్నారు. టైప్ 1 డయాబెటీస్.. చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.