ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)
ఇస్లామాబాద్ : అమాయక కశ్మీర్ ప్రజలపై భారత సైనిక దళాలు తూటల వర్షం కురిపిస్తున్నాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై మరోసారి అక్కసు వెల్లగక్కారు. జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ మిలిటెంట్లు హతమవ్వగా.. ఆ వెంటనే సంఘటనా స్థలంలో మిలిటెంట్లు పెట్టిన బాంబులు పేలడంతో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం స్పందించిన ఇమ్రాన్.. భారత సైన్యం కశ్మీర్ పౌరులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కశ్మీర్ సమస్యకు ఇకనైన ముగింపు పలకాలని ట్వీట్ చేశారు.
ఐక్యరాజ్య సమితి ద్వారా భారత్ చర్చలకు రావాలి.. చర్చలతోనే కశ్మీర్‌కు సమస్యకు శాస్వత పరిష్కరం దొరుగుతుందని ట్విటర్‌లో పేర్కొన్నాడు. కశ్మీర్ పౌరులపై దాడులను ప్రేరేపిస్తూ.. పాక్‌తో చర్చల వల్ల ప్రయోజనం లేదని భారత్ అభిప్రాయపడుతోందని ఇమ్రాన్ అన్నారు. కాగా లారూ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం అందడంతో ఆదివారం భద్రతా బలగాలు అక్కడ తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో మొత్తం పదిమంది చనిపోయారని పోలీస్ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment