
శ్రీనగర్ : కశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కరోనా మహమ్మారితో దేశం పోరాడుతున్న సమయంలోనూ ఉగ్రమూకలు భారత్‌లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నాయి. కశ్మీర్‌లోని సొపోర్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment