ఖాన్ వద్దు - కమేడియన్ ముద్దు | Imran Khan ex-wife is comedian's beau now | Sakshi
Sakshi News home page

ఖాన్ వద్దు - కమేడియన్ ముద్దు

Published Mon, Mar 24 2014 4:37 PM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

ఖాన్ వద్దు - కమేడియన్ ముద్దు

ఖాన్ వద్దు - కమేడియన్ ముద్దు

జెమీమా ఖాన్ ఎవరో గుర్తుందా? క్రికెట్ మన్మథుడు ఇమ్రాన్ ఖాన్ ను ఏరికోరి పెళ్లాడిన బ్రిటిష్ అందగత్తె ఆమె. హాండ్సమ్ పఠాన్ కోసం బ్రిటన్ వదిలి, పాకిస్తాన్కు వచ్చి, అక్కడి పద్ధతి ప్రకారం తలపై ముసుగేసుకుని సంచలనం సృష్టించింది అందాల జెమీమా.


ఆ తరువాత ఖాన్ గారి జెనానా నుంచి బయటపడి ఇంగ్లండ్ కి చేరుకుంది. ఇటు ఇమ్రాన్ ఖాన్కి క్రికెట్ నుంచి పాలిటిక్స్ పై మనసు మళ్లింది. ఇద్దరూ 'నా దారి నాది. నీ దారి నీది' అనేసుకున్నారు. ఇదంతా అయ్యే సరికి జెమీమాకి ఇద్దరు పిల్లలు.


ఇప్పుడు జెమీమా రస్సెల్ బ్రాండ్ అనే బ్రిటిష్ కమేడియన్ ప్రేమలో పడింది. ఇంత లేటు వయసులో ఎంత ఘాటు ప్రేమంటే ఎక్కడ చూసినా ఈ ఇద్దరే కనిపిస్తున్నారట. జెమీమా వేలికి రస్సెల్ బహుమతిగా ఇచ్చిన వజ్రపుటుంగరం తళుక్కుమంటోంది.


అన్నట్టు రస్సెల్ బాబు కూడా సామాన్యుడు కాదండోయ్! కటీ పెర్రీకి ఈ మధ్యే కటీఫ్ ఇచ్చేశాడట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement